Shivaji: ‘సరిపోదా శనివారం’ చూసి అద్దాన్ని పగలగొట్టిన శివాజీ.. అసలు ఏం జరిగిందంటే?
సరిపోదా శనివారం సినిమాలో ఎస్.జె.సూర్య పాత్ర గురించి ఆసక్తికర కామెంట్స్ చేసిన నటుడు శివాజీ(Shivaji).
- V Santhosh Kumar
- Published On : March 18, 2026 / 10:35 AM IST
Shivaji interesting comments on sj surya character in Saripodhaa Sanivaaram
Shivaji: నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘సరిపోదా శనివారం’. యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో నాని నటనకు ప్రశంసలు దక్కినప్పటికీ, విలన్ పాత్రలో ఎస్.జె.సూర్య చేసిన నటన ప్రేక్షకులను, సినీ ప్రముఖులను విశేషంగా ఆకట్టుకుంది. తాజాగా నటుడు శివాజీ(Shivaji) ఈ సినిమాపై, ముఖ్యంగా ఎస్.జె.సూర్య పోషించిన ఇన్‌స్పెక్టర్ దయా పాత్రపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Fauzi: ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఆగస్టుకి ‘ఫౌజీ’ షూటింగ్ ఫినిష్.. రిలీజ్ ఎప్పుడంటే?
ఈ సినిమా చూసిన తరువాత ఒక నటుడిగా తనకు ఎదురైన ఆవేదనను శివాజీ ఎంతో నిజాయితీగా పంచుకున్నారు. ‘సరిపోదా శనివారం’ చూస్తున్నప్పుడు నాకు ఒక రకమైన అసూయ, ఫ్రస్ట్రేషన్ కలిగాయి. సినిమాలో ఎస్.జె.సూర్య నటన ఎంత అద్భుతంగా ఉందంటే, అది చూసి నేను డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయాను. ఒక నటుడిగా పాతికేళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను. కానీ నాకు ఎందుకు ఇలాంటి పవర్‌ఫుల్ పాత్రలు రావు? అనే బాధ నన్ను వెంటాడింది. ఆ ఆవేశంలో బాత్రూమ్‌లోకి వెళ్లి ఫేస్ వాష్ చేసుకుంటున్న సమయంలో, కోపాన్ని ఆపుకోలేక చేత్తో అద్దాన్ని గట్టిగా గుద్దాను. అద్దం పగిలి నా చేయి కూడా వాచిపోయింది.
నటుడిగా నాలోని ఆకలిని ఎస్.జె.సూర్య పాత్ర మేల్కొలిపింది. ఈ విషయాన్ని స్వయంగా నానికే ఫోన్ చేసి చెప్పాను. నాని.. నీకంటే సూర్య పాత్రే నాకు బాగా నచ్చింద అని ముక్కుసూటిగా చెప్పేశాను. ఆ తర్వాత ‘కోర్ట్’ సినిమాలో మంగపతి పాత్ర దక్కడం నా ఆకలిని తీర్చింది’ అంటూ తన సంతోషాన్ని పంచుకున్నాడు శివాజీ. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో శివాజీ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. నైంటీస్ వెబ్ సిరీస్, కోర్ట్, దండోరా లాంటి సినిమాల్లో మంచి పత్రాలు చేశాడు శివాజీ. ఇటీవల ఆయన ప్రధాన పాత్రలో వచ్చిన సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని అనే సినిమా కూడా విదులయ్యింది.
