Shivam Shaivam
Shivam Shaivam : అమ్మ క్రియేషన్స్ బ్యానర్ పై సాయి శ్రీనివాస్ MK స్వీయ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘శివం శైవం’. దినేష్ కుమార్, అన్షు పొన్నచెన్, రాజశేఖర్, జయంత్ కుమార్.. పలువురు కీలక పాత్రల్లో నటించారు.(Shivam Shaivam)
నేడు వినాయకచవితి సందర్భంగా ఈ సినిమా టైటిల్ రివిలింగ్ & కాన్సెప్ట్ పోస్టర్ ని డైరెక్టర్ వీరశంకర్ చేతుల మీదుగా రిలీజ్ చేసారు. ఈ సందర్భంగా డైరెక్టర్ వీర శంకర్.. మంచి కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కించారని, సినిమా హిట్ అవ్వాలని అన్నారు.
నిర్మాత & డైరెక్టర్ MK సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ.. మా సినిమా ఫస్ట్ లుక్, కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన డైరెక్టర్ వీర శంకర్ గారికి ధన్యవాదాలు. వాస్తవ సంఘటనలు ఆధారంగా తీసుకుని గ్రామీణ నేపథ్యంలో మైథలాజి జోనర్ లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాం అన్నారు.