×
Ad

ShivaRaj kumar: తెరపైకి ప్రజానాయకుడి జీవితం.. “గుమ్మడి నర్సయ్య”గా శివరాజ్ కుమార్

ప్రఖ్యాత రాజకీయ నాయకుడు, ప్రజల మనిషిగా పేరుతెచ్చుకున్న వ్యక్తి గుమ్మడి నర్సయ్య(Shiva Rajkumar) జీవితకథతో సినిమా రాబోతోంది. కొత్త దర్శకుడు పరమేశ్వర్ హివ్రాలే తెరకెక్కిస్తున్న ఈ సినిమాను ప్రవల్లిక ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్ పై ఎన్. సురేశ్‌ రెడ్డి నిర్మిస్తున్నారు.

Shivaraj Kumar's first look released from Gummadi Narsaiah biopic

ShivaRaj kumar: ప్రఖ్యాత రాజకీయ నాయకుడు, ప్రజల మనిషిగా పేరుతెచ్చుకున్న వ్యక్తి గుమ్మడి నర్సయ్య జీవితకథతో సినిమా రాబోతోంది. కొత్త దర్శకుడు పరమేశ్వర్ హివ్రాలే తెరకెక్కిస్తున్న ఈ సినిమాను ప్రవల్లిక ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్ పై ఎన్. సురేశ్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో (ShivaRaj kumar)గుమ్మడి నర్సయ్య పాత్రను కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ పోషిస్తున్నారు. సినిమా నుంచి ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ ను తాజాగా విడుదల చేశారు మేకర్స్. ఈ ఒక్క పోస్టర్ తో సినిమాపై హైప్ ను పెంచేశారు మేకర్స్.

Renu Desai: సన్యాసం తీసుకుంటా.. రేణు దేశాయ్ షాకింగ్ కామెంట్స్.. ఫైనల్ గా క్లారిటీ వచ్చేసింది

పోస్టర్ చూస్తుంటే… గుమ్మడి నర్సయ్య పాత్రకు శివ రాజ్ కుమార్ పర్ఫెక్ట్ ఛాయస్ అన్నట్టుగా ఉంది ఆయన లుక్. తెల్ల దుస్తులు, ఒక భుజానికి సంచి, మరో భుజంపై ఎర్ర కండువా, చేతిలో సైకిల్, ఆ సైకిల్ కి సుత్తి కొడవలి జండా, వెనకాల అసెంబ్లీ ఇలా చాలా ఎలిమెంట్స్ ని ఈ ఒక్క పోస్టర్ లో చూపించి ఆసక్తిని పెంచారు. చాలా అథెంటిక్‌గా కూడా అనిపిస్తున్నాయి. ఇక మోషన్ పోస్టర్‌లో సైతం.. ఎమ్మెల్యేలంతా కారులో రావడం.. గుమ్మడి నర్సయ్య మాత్రం సైకిల్‌ పై రావడం చూపించారు. ఆ పోస్టర్ కి తగ్గట్టుగా మ్యూజిక్, విజువల్స్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. ఇవన్ని చూస్తుంటే ఖచ్చితంగా ఈ సినిమా బయోపిక్ లలో ఒక కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తుంది అనే అనుభూతిని కలిగిస్తోంది. ఇక పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ సినిమాకు సంగీతం సురేశ్‌ బొబ్బిలి, ఎడిటర్ సత్య గిడుటూరి, కెమెరామెన్ గా సతీశ్‌ ముత్యాల పని చేయనున్నారు.