Renu Desai: సన్యాసం తీసుకుంటా.. రేణు దేశాయ్ షాకింగ్ కామెంట్స్.. ఫైనల్ గా క్లారిటీ వచ్చేసింది

నా జీవితంలో ఇలాంటి ఒక వీడియో చేయాల్సి వస్తుందని ఎప్పుడు అనుకోలేదు. (Renu Desai)రీసెంట్ గా నేను పాల్గొన్న దీపావళి ఇంటర్వ్యూలో యాంకర్‌ నెక్ట్స్‌ ఏంటి అని అడిగింది.

Renu Desai: సన్యాసం తీసుకుంటా.. రేణు దేశాయ్ షాకింగ్ కామెంట్స్.. ఫైనల్ గా క్లారిటీ వచ్చేసింది

Actress Renu Desai clarifies comments about taking up sannyas

Updated On : October 22, 2025 / 8:47 PM IST

Renu Desai: నటి రేణు దేశాయ్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఆమె ఇటీవల సన్యాసం గురించి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దాంతో, ఆమె మరోసారి సోషల్ మీడియాలో వీడియో రిలీజ్ చేయాల్సి వచ్చింది. ఆ వీడియోలో.. “నా జీవితంలో ఇలాంటి వీడియో చేయాల్సి(Renu Desai) వస్తుందని అనుకోలేదు” అంటూ చెప్పికొచ్చింది. దీంతో చాలా కాలం తరువాత మరోసారి వార్తల్లో నిలిచింది రేణు దేశాయ్. అసలు విషయం ఏంటంటే.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు రేణు దేశాయ్. ఆ ఇంటర్వ్యూలో యాంకర్ రేణు దేశాయ్ ని ఉద్దేశిస్తూ.. మీ లైఫ్ లో ఏంటి అని అడిగింది.

Haal: ‘హాల్’ సినిమాలో బీఫ్ వివాదం.. మతపరమైన అంశాలు.. కేరళ హైకోర్టు స్క్రీనింగ్ పై ఉత్కంఠ

దానకి సమాదానంగా రేణు దేశాయ్ మాట్లాడుతూ.. “సన్యాసం తీసుకోవాలి అనుకుంటున్నా” అంటూ చెప్పుకొచ్చింది. అంతే, ఆ ఒక్క కామెంట్ తో సోషల్ మీడియా మొత్తం షేక్ అయ్యింది. ఎక్కడ చూసిన ఈ కామెంట్స్ గురించే చర్చలు నడిచాయి. ఆ వార్తలు రేణు దేశాయ్ వరకు చేరడంతో.. ఆ కమెంట్స్ పై క్లారిటీ ఇస్తూ మరో వీడియో విడుదల చేసింది. ఆ వీడియోలో ఆమె మాట్లాడుతూ..”నా జీవితంలో ఇలాంటి ఒక వీడియో చేయాల్సి వస్తుందని ఎప్పుడు అనుకోలేదు. రీసెంట్ గా నేను పాల్గొన్న దీపావళి ఇంటర్వ్యూలో యాంకర్‌ నెక్ట్స్‌ ఏంటి అని నన్ను అడిగింది. దానికి చాలా సరదాగా సన్యాసం తీసుకుంటా బదులిచ్చాను. కానీ, దానర్థం ఇప్పటికిప్పుడు తీసుకుంటానని కాదు. అలా అని ఎక్కడా చెప్పలేదు. నేను సరదాగా చెప్పిన విషయాన్నీ సెన్సేషన్ చేశారు. ఆ న్యూస్ చూసి నా ఫ్రెండ్స్‌, బంధువులు కాల్ చేసి ఏం జరిగింది అని అడుగుతున్నారు. నాకు ఇద్దరు పిల్లలున్నారు. ప్రస్తుతం వాళ్ళే నా ప్రపంచం. దేవుడి కంటే వాళ్ళే ముఖ్యం. నా వయసు 60 వచ్చినప్పుడు ఆలోచిస్తా” అంటూ క్లారిటీ ఇచ్చింది.

దీంతో, రేణు దేశాయ్ సన్యాసం గురించి వస్తున్న వార్తలకు చెక్ పడింది. ఇక రేణు దేశాయ్ సినిమాల విషయానికి వస్తే, జానీ సినిమా తరువాత చాలా ఏళ్ళపాటు వెండితెరకు దూరంగా ఉన్న ఆమె తరువాత కొన్ని షోలకి జడ్జిగా వ్యవహరించారు. ఇక చివరగా ఆమె రవి తేజ హీరోగా వచ్చిన టైగర్ నాగేశ్వర రావు సినిమాలో కీ రోల్ చేశారు. ప్రస్తుతం ఆమె తన వ్యక్తిగత జీవితంలో బిజీగా ఉన్నారు.

 

View this post on Instagram

 

A post shared by renu desai (@renuudesai)