Shobha Shetty Remuneration : శోభాశెట్టికి షాకింగ్ రెమ్యునరేషన్..?
ఆదివారం నాటి ఎపిసోడ్‌లో శోభాశెట్టి ఎలిమినేట్ అయ్యింది. 14 వారాల పాటు ఆమె హౌస్‌లో ఉంది.
- Thota Vamshi Kumar
- Published On : December 11, 2023 / 04:51 PM IST
Shobha Shetty Remuneration 14 Weeks In Bigg Boss House
Shobha Shetty Remuneration In Bigg Boss House : బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 చివరకు వచ్చేసింది. ప్రస్తుతం ఆరుగురు హౌస్‌లో ఉన్నారు. ఆదివారం నాటి ఎపిసోడ్‌లో శోభాశెట్టి ఎలిమినేట్ అయ్యింది. 14 వారాల పాటు ఆమె హౌస్‌లో ఉంది. తనదైన ఆటతీరుతో ఆకట్టుకుంటూ ఎన్నో సార్లు ఎలిమినేషన్ నుంచి తప్పించుకుంటూ వచ్చింది. అయితే.. చివరికి ఎలిమినేట్ అయ్యింది. ఇక ఆమె రెమున్యరేషన్‌కు సంబంధించిన వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నారు.
అర్జున్ ఇప్పటికే ఫైనల్ కు చేరుకోగా ఆదివారం నాటి ఎపిసోడ్‌లో ప్రియాంక, ప్రశాంత్, అమర్ దీప్, యావర్, శివాజీ లు ఫైనల్‌కు చేరుకున్నట్లు ప్రకటించారు నాగార్జున. ప్రతీ సారి ఐదుగురు మాత్రమే ఫైనల్‌కు చేరుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్ ఉల్టా ఫుల్టా అని ముందుగా చెప్పినట్లుగానే ఈ సారి ఫైనల్‌కు ఆరుగురు చేరుకున్నారు. ఇక ఎలిమినేట్ అయిన శోభాశెట్టి స్టేజీపైన కన్నీళ్లు పెట్టుకుంది. అందరికి ఆల్ ది బెస్ట్ చెప్పింది.
Sreeleela : పవన్, ఎన్టీఆర్, బన్నీ పాటలకు శ్రీలీల మాస్ స్టెప్పులు చూశారా..?
ఇక 14 వారాల పాటు హౌస్‌లో శోభా రెమ్యునరేషన్ కింద భారీగా అందుకుందని అంటున్నారు. వారానికి రూ.2.5 లక్షల చొప్పున రెమ్యునరేషన్ మాట్లాడుకున్నట్లు టాక్. ఈ లెక్కన 14 వారాలకు రూ.35లక్షలు సంపాదించినట్లుగా తెలుస్తోంది.
Geetha Madhuri : మరోసారి తల్లికాబోతున్న సింగర్ గీతా మాధురి..
