Geetha Madhuri : మ‌రోసారి త‌ల్లికాబోతున్న సింగ‌ర్ గీతా మాధురి..

Geetha Madhuri second time pregnancy : సింగ‌ర్ గీతా మాధురి రెండో సారి త‌ల్లికాబోతుంది.

Geetha Madhuri : మ‌రోసారి త‌ల్లికాబోతున్న సింగ‌ర్ గీతా మాధురి..

Singer Geetha Madhuri to Gives Birth her Second Child in 2024 February

Updated On : December 11, 2023 / 4:21 PM IST

తెలుగు ప్రేక్ష‌కుల‌కు సింగ‌ర్ గీతా మాధురి గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. త‌న హ‌స్కీ వాయిస్‌తో మెస్మ‌రైజ్ చేస్తూ ఎంతో మంది అభిమానుల‌ను సంపాదించుకున్నారు. మ‌గాళ్లు ఉట్టి మాయ‌గాళ్లే అని అన్నా.. చమ్మా.. చ‌మ్మా.. చ‌మ్కీరే అని అన్నా గీత మాధురి వాయిస్‌ను ఇట్టే గుర్తు ప‌ట్టేస్తారు అభిమానులు. ఇక బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లిన గీతా.. ప్ర‌తి ఇంటిలో ఓ అక్క‌లా మారింది.

తాజాగా ఆమె రెండో సారి త‌ల్లికాబోతుంది. ఈ విష‌యాన్ని గీతామాధురి సోష‌ల్ మీడియా వేదిక‌గా స్వ‌యంగా వెల్ల‌డించింది. 2024 ఫిబ్ర‌వ‌రిలో తాను బిడ్డ‌కు జ‌న్మ‌ను ఇవ్వ‌బోతున్న‌ట్లు చెప్పుకొచ్చింది. ఈ విష‌యం తెలిసిన అభిమానులు, సెల‌బ్రెటీలు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు.

Guntur Kaaram : గుంటూరు కారం మెలోడీ సాంగ్ ప్రోమో వచ్చేసింది.. ఓ మై బేబీ..

2014 ఫిబ్ర‌వ‌రి 9న నటుడు నందును గీతామాధురి వివాహం చేసుకుంది. వీరికి 2019లో కూతురు జ‌న్మించింది. ఆ పాప‌కు దాక్షాయణి ప్రకృతి అనే పేరు పెట్టారు. తాజాగా మ‌రోసారి గీతా ప్రెగ్నెంట్ అయ్యింది. ఈ విష‌యాన్ని కొంచెం వెరైటీగా చెప్పింది. ద్రాక్షాయ‌ణి ప్ర‌కృతి 2024 ఫిబ్ర‌వ‌రిలో అక్క కాబోతుంద‌ని అంటూ గీతా మాధురి ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. అంతేకాదండోయ్ ప‌లు ఫోటోల‌ను షేర్ చేసింది.

 

View this post on Instagram

 

A post shared by Geetha Madhuri (@singergeethamadhuri)

అందుకే విడాకుల రూమ‌ర్లు..

ఇదిలా ఉంటే.. గీతా మాధురి టాలీవుడ్‌లో సింగర్‌గా రాణిస్తోంది. నందు ఓ ప‌క్క సినిమాలు చేస్తూ మ‌రొప‌క్క వెబ్ సిరీస్‌లు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇక క్రికెట్ సీజ‌న్‌లో తెలుగు కామెంటేట‌ర్‌గా అల‌రిస్తూ ఉంటాడు. ఇటీవ‌ల నందు న‌టించిన మ్యాన్ష‌న్ 24 అనే వెబ్ సిరీస్ హాట్ స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ ప్ర‌మోష‌న్‌లో భాగంగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న నందు విడాకుల రూమ‌ర్ల‌పై స్పందించాడు.

Karavali : కన్నడ నుంచి మరో పాన్ ఇండియా సినిమా.. ‘కరావళి’.. గేదె చుట్టూ కథ? మహిషావతారంలో హీరో..

గీతా, నేను విడిపోతున్నాం అంటూ ఆ మ‌ధ్య ప‌లు రూమ‌ర్లు వ‌చ్చాయి. మేము ఇద్ద‌రం క‌లిసి ఉన్న ఫోటోలు, వీడియోలు షేర్ చేయ‌క‌పోవ‌డంతోనే ఈ రూమ‌ర్లు మొద‌లు అయ్యాయి. బ‌య‌ట కూడా మేము క‌లిసి క‌నిపించ‌క‌పోవ‌డంతో అవే నిజ‌మ‌ని చాలా మంది న‌మ్మారు. అయితే ఇందులో ఎంత మాత్రం నిజం లేద‌ని చెప్పాడు.