శ్రియ కాపురంలో కరోనా కలకలం.. భర్తకు దూరంగా..

నటి శ్రియా శరణ్ భర్త ఆండ్రూకి కరోనా లక్షణాలుండడంతో సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉంటున్నాడు..

  • Publish Date - April 14, 2020 / 11:01 AM IST

నటి శ్రియా శరణ్ భర్త ఆండ్రూకి కరోనా లక్షణాలుండడంతో సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉంటున్నాడు..

ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా కట్టడిలో భాగంగా కొనసాగుతున్న లాక్‌డౌన్‌తో సామాన్యుల నుంచి మొదలుకుని సెలబ్రిటీల వరకు అందరు ఇళ్లకే పరిమితమయ్యారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఏదో వైపు నుండి కరోనా కమ్మేస్తోంది. తాజాగా నటి శ్రియా భర్త కరోనా లక్షణాలతో హాస్పిటల్‌లో జాయిన్ అవడం సంచలనంగా మారింది.

అతగాడి గురించి రకరకాల వార్తలు వస్తుండడంతో శ్రియ స్పందించింది. తన భర్త ఆండ్రూ కొచీవ్‌ పొడి దగ్గు, జ్వరం వంటి కరోనా లక్షణాలతో బాధపడుతున్నాడని తెలిపింది. దీంతో ముందస్తు జాగ్రత్తలో భాగంగా ఆండ్రూ సెల్ఫ్‌ క్వారంటైన్‌లో తమ ఇంట్లోనే ప్రత్యేక గదిలో ఉంటున్నాడని తెలిపింది.

Read Also : కొత్త బిజినెస్.. MB OTT?..

ఇటీవల లాక్‌డౌన్ వేళ తన భర్త అండ్రీ కిచెన్‌లో వంట పాత్రలను శుభ్రం చేస్తున్న వీడియోను ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్‌చేస్తూ.. శ్రియ ఈ ఛాలెంజ్‌ను(బార్తన్‌సాఫ్‌కరో) స్వీకరించాల్సిందిగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, తమిళ యంగ్ హీరో ఆర్యలతో పాటు పలువురిని నామినేట్‌ చేసిన సంగతి తెలిసిందే. 2018లో బార్సిలోనా టెన్నిస్‌ప్లేయర్‌ ఆండ్రూను మ్యారేజ్ చేసుకున్న తర్వాత శ్రియ సినిమాలకు దూరంగా ఉంటోంది.