అవును.. సర్జరీ చేయించుకున్నా.. ప్రచారం చేసుకోలేదు..

ప్లాస్టిక్ సర్జరీ ట్రోల్స్‌పై స్పందించిన శ్రుతి హాసన్..

  • Publish Date - February 28, 2020 / 02:20 PM IST

ప్లాస్టిక్ సర్జరీ ట్రోల్స్‌పై స్పందించిన శ్రుతి హాసన్..

ప్రియుడితో లవ్, బ్రేకప్, అనారోగ్యం తర్వాత కొద్ది గ్యాప్ తీసుకుని  మళ్లీ సినిమాల్లో సందడి చేయడానికి సిద్ధమైంది శ్రుతి హాసన్. ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ పక్కన ‘క్రాక్’ సినిమాలో నటిస్తోంది. హిందీలో కాజోల్‌తో కలిసి ‘దేవి’ అనే షార్ట్ ఫిల్మ్‌లోనూ శ్రుతి కనిపించనుంది. ఈ మధ్య శ్రుతి లుక్ చూసి ఆమె ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది అంటూ రకరకాలుగా నెటిజన్స్ ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు.

తాజాగా తనపై వస్తున్న ట్రోల్స్ గురించి సోషల్ మీడియా ద్వారా స్పందించింది శ్రుతి హాసన్. ‘ఇతరుల అభిప్రాయాలకు అనుగుణంగా నేను ప్రవర్తించను. నేను ప్రస్తుతం చెప్పబోయే విషయం ప్రతి మహిళా ఎదుర్కొనేదే. హార్మోన్ల సమస్య కారణంగా నేను తరచుగా శారీరకంగా, మానసికంగా అసౌకర్యానికి గురవుతున్నా. ఆరోగ్యంగా ఉండేందుకు చాలా కష్టపడుతున్నా.

కానీ, అదంత సులభం కాదు. నేను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నా. దీని గురించి నేను ప్రచారం చేసుకోలేదు. నేను ఎలా జీవించాలనుకుంటానో అలాగే జీవిస్తా. నన్ను నేను ఎప్పుడూ ప్రేమిస్తా’ అంటూ శ్రుతి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. శ్రుతి సర్జరీ విషయం నెట్టింట్లో వైరల్ అవుతోంది.