సినిమా కోసం రెడ్‌లైట్ ఏరియాకెళ్లిన శ్వేతా బస్..

Shweta Basu: ‘ఎకడా’.. అంటూ తన ముద్దు ముద్దు మాటలతో తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుని తర్వాత వివాదాల్లో చిక్కుకుని దాదాపు కనుమరుగైపోయిన శ్వేతా బసు ప్రసాద్ పెళ్లై ఏడాది కాకుండానే వైవాహిక జీవితానికి ముగింపు పలికింది. భర్త రోహిత్‌ మిట్టల్‌ నుండి విడిపోతున్నట్టు ఇటీవలే ప్రకటించింది.

https://10tv.in/shweta-basu-prasad-talks-about-divorce-rohit-mittal-24167/

ప్రస్తుతం కెరీర్ మీద దృష్టి పెట్టిన శ్వేత బాలీవుడ్‌లో ప్రముఖ దర్శకుడు మధూర్ బండర్కర్ తెరకెక్కిస్తున ‘ఇండియా లాక్‌డౌన్’ అనే సినిమాలో నటిస్తోంది.
ఈ మూవీలో సెక్స్ వర్కర్ పాత్రలో కనిపించనున్న శ్వేత ఇటీవల బాంబేలోని రెడ్‌లైట్ ఏరియాకి వెళ్లింది.

కోవిడ్ ప‌రిస్థితుల్లో విధించిన లాక్‌డౌన్ స‌మ‌యంలో ముంబై రెడ్‌లైట్‌లోని పడ్డారు. వారి స‌మ‌స్య‌ల‌ను తెలుసుకోవాల‌నుకున్న శ్వేతా బ‌సు స్వ‌యంగా రెడ్‌లైట్ ఏరియాకు వెళ్లడం విశేషం. ‘నేను, మ‌ధు స‌ర్‌, నా టీమ్.. రెండు వారాల క్రితం కామాటిపురా వెళ్లాం. అక్క‌డి వారి యాస‌ను బ‌ట్టి ఎలా మాట్లాడాలో నేర్చుకున్నాను. అక్క‌డికి వెళ్ల‌డం లైఫ్ టైమ్ ఎక్స్‌పీరియెన్స్‌’ అని తెలిపింది శ్వేతా బసు ప్రసాద్.