×
Ad

Shyamali De: తెగించిన వాళ్ళు ఇలానే చేస్తారు.. సమంతతో పెళ్లిపై రాజ్ మాజీ భార్య షాకింగ్ పోస్ట్

స్టార్ హీరోయిన్ సమంత రెండో పెళ్లి చేసుకున్నారు. హీరో నాగ చైతన్యతో విడాకుల తరువాత చాలా కాలం పాటు ఒంటరిగా ఉన్న(Shyamali De) సమంత ఎట్టకేలకు దర్శకుడు రాజ్ నిడిమోరును పెళ్లి చేసుకున్నారు.

Shyamali De shocking comments on Raj Nidimoru-Samantha second marriage

Shyamali De: స్టార్ హీరోయిన్ సమంత రెండో పెళ్లి చేసుకున్నారు. హీరో నాగ చైతన్యతో విడాకుల తరువాత చాలా కాలం పాటు ఒంటరిగా ఉన్న సమంత ఎట్టకేలకు దర్శకుడు రాజ్ నిడిమోరును పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహం డిసెంబర్ 1న కోయంబత్తూర్ లోని ఇషా ఫౌండేషన్ లో జరిగింది. అత్యంత సన్నిహితల మధ్య ఈ పెళ్లి వేడుక చాలా నిరాడంబరంగా జరిగింది. తాజా ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తమ అభిమానుల తో పంచుకున్నారు. దీంతో నెటిజన్స్ కొత్త జంటకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Samanth-Raj Wedding: రెండో పెళ్లి చేసుకున్న సమంత.. దర్శకుడు రాజ్ నిడిమోరుతో కొత్త ప్రయాణం.. ఫోటోలు వైరల్

ఇదిలా ఉంటే, తాజాగా సమంత-రాజ్ నిడిమోరు పెళ్లిపై రాజ్ మాజీ భార్య శ్యామలి దే(Shyamali De) షాకింగ్ పోస్ట్ పెట్టింది. “తెగించిన వ్యక్తులు ఇలాంటి పనులే చేస్తారు” అంటూ రాసుకొచ్చింది. దీంతో శ్యామలి దే చేసిన ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే, దర్శకుడు రాజ్ కి కూడా సమంతతో రెండో పెళ్లి అనే విషయం తెలిసిందే. మరి రాజ్ భార్య ఇలాంటి పోస్ట్ ఎందుకు పట్టాల్సి వచ్చింది. వీరిద్దరికీ ఇంకా విడాకులు అవ్వలేదు. ఒకవేళ కాకుండా సమంతను రాజ్ ఎలా పెళ్లి చేసుకున్నాడు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా సమంత-రాజ్ రెండో పెళ్లి వేళ శ్యామలి దే చేసిన ఈ పోస్ట్ కాస్త సెన్సేషన్ గా మారింది.

ఇక దర్శకుడు రాజ్ విషయానికి వస్తే, ఈయన సినీ ప్రియులకు సుపరిచితమే. తెలుగు డైరెక్టర్ అయినప్పటికి బాలీవుడ్ లో భారీ సినిమాలు చేస్తున్నాడు ఈ దర్శకుడు. సమంత రాజ్ దర్శకత్వంలో ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2లో నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే ఇద్దరి మనసులు కలిశాయని టాక్. అలా కొన్నేళ్ల పేరు రిలేషన్ లో ఉన్న ఈ జంట ఎట్టకేలకు పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు.

Shyamali De shocking comments on Raj Nidimoru-Samantha second marriage