Samanth-Raj Wedding: రెండో పెళ్లి చేసుకున్న సమంత.. దర్శకుడు రాజ్ నిడిమోరుతో కొత్త ప్రయాణం.. ఫోటోలు వైరల్
సౌత్ స్టార్ బ్యూటీ సమంత రెండో పెళ్లి చేసుకుంది. వేద పండితుల సాక్షిగా సమంత – దర్శకుడు రాజ్ మూడు(Samanth-Raj Wedding) ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఈ పెళ్లి వేడు కోయంబత్తూరులోని సద్గురు ‘ఈషా ఫౌండేషన్’ లో జరిగింది. అత్యంత గోప్యాంగా జరిగిన ఈ పెళ్ళికి ఇరు కుటుంబాల నుంచి అతి కొద్ది మంది బందు మిత్రులు మాత్రమే హాజరయ్యారు. ఇక సమంత ఏడాది కాలంగా దర్శకుడు రాజ్ నిడిమోరుతో రిలేషన్ లో వున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ రిలేషన్ లో నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్తు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. దీంతో ఈ న్యూస్ ఇప్పుడు నేషనల్ వైడ్ గా హాట్ టాపిక్ అయ్యింది. ఇక ఈ న్యూస్ తెలిసిన సమంత ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.





