Samsung Galaxy A35 : అమెజాన్‌లో అద్భుతమైన ఆఫర్.. ఈ శాంసంగ్ గెలాక్సీ A35పై కిర్రాక్ డిస్కౌంట్.. ఎలాగంటే?
Samsung Galaxy A35 : శాంసంగ్ అభిమానులకు అద్భుతమైన ఆఫర్.. అమెజాన్‌లో ఈ శాంసంగ్ గెలాక్సీ A35 ఫోన్ ధర ఏకంగా రూ. 13వేలు తగ్గింది. ఈ అదిరిపోయే డీల్ ఎలా పొందాలంటే?

Samsung Galaxy A35 : కొత్త శాంసంగ్ ఫోన్ కోసం చూస్తున్నారా? ప్రస్తుతం అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ (Samsung Galaxy A35 5G) ఫోన్ భారీ ధర తగ్గింపుతో లభిస్తోంది. ఈ ఫోన్ ప్లాట్‌ఫారమ్‌లో రూ. 13వేల కన్నా ఎక్కువ ధర తగ్గింపుతో లభిస్తోంది. మిడ్ రేంజ్ స్మార్ట్ఫోన్లలో ఇదొకటి.

ఈ ఫోన్లో 50MP ప్రైమరీ లెన్స్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. భారీ డిస్ప్లేతో వస్తుంది. హుడ్ కింద క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. రూ. 21వేల కన్నా ఎక్కువ ధరలో ఫోన్ కోసం చూస్తుంటే శాంసంగ్ గెలాక్సీ A35 ఆకర్షణీయమైన డీల్ అని చెప్పొచ్చు. ఇంతకీ ఈ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ A35 డీల్ : ప్రస్తుతం శాంసంగ్ గెలాక్సీ A35పై అమెజాన్ రూ.13,250 ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది. దాంతో ఈ శాంసంగ్ ఫోన్ ధర రూ.19,749కి తగ్గింది. అయితే, అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలు చేస్తే రూ.592 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ నెలకు రూ.694 నుంచి నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా అందిస్తోంది.

మీరు అప్‌గ్రేడ్ చేస్తుంటే మీ పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు. రూ. 18,450 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ పొందవచ్చు. అయితే, ఫైనల్ ఎక్స్ఛేంజ్ ధర మీ పాత ఫోన్ బ్రాండ్, మోడల్, వర్కింగ్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది.

శాంసంగ్ గెలాక్సీ A35 స్పెసిఫికేషన్లు : శాంసంగ్ గెలాక్సీ A35 5జీ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల FHD+ అమోల్డ్ డిస్ప్లేతో వస్తుంది. 1,900 నిట్స్ టాప్ బ్రైట్నెస్ కూడా అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ హుడ్ కింద క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. అడ్రినో 710 జీపీయూతో వస్తుంది. 12GB ర్యామ్, 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది.

ఈ శాంసంగ్ ఫోన్ ఆండ్రాయిడ్ 15తో వస్తుంది. 6 జనరేషన్ ఆండ్రాయిడ్ OS అప్‌గ్రేడ్‌లకు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ అందుకుంటుంది. ఇంకా, హ్యాండ్సెట్ 5,000mAh బ్యాటరీతో రానుంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.

కెమెరా విషయానికి వస్తే.. శాంసంగ్ గెలాక్సీ A35 ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో 50MP ప్రైమరీ సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్ లెన్స్, 5MP మాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం స్మార్ట్‌ఫోన్ ఫ్రంట్ సైడ్ 12MP కెమెరాతో వస్తుంది.
