Siddharth : సిద్దార్థ్ ట్విట్టర్ నుంచి వెళ్ళిపోడానికి కారణం తోటి హీరోలా..? క్లారిటీ ఇచ్చిన హీరో!

సిద్దార్థ్ ట్విట్టర్ నుంచి వెళ్ళిపోడానికి కారణం తోటి హీరోలు, నటులే తనని సపోర్ట్ చేయకపోవడమే అంటూ అప్పటిలో కథనాలు వచ్చాయి. తాజాగా సిద్దార్థ్ ఒక ఇంటర్వ్యూలో..

Siddharth open up why he quit twitter at Takkar promotions interview

Siddharth – Takkar : టాలీవుడ్ లో ఒక్కప్పుడు బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, ఓయ్ వంటి లవ్ స్టోరీస్ తో సూపర్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న సిద్దార్థ్.. ప్రస్తుతం తమిళంలోనే సినిమాలు చేస్తూ వస్తున్నాడు. తాజాగా ఈ హీరో టక్కర్ (Takkar) అనే సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీ తెలుగులో కూడా రిలీజ్ కాబోతుంది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో ఉన్న సిద్దార్థ్ పలు ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నాడు. ఇక ఒక ఇంటర్వ్యూలో తాను ట్విట్టర్ నుంచి బయటకి వచ్చేయడానికి గల కారణం చెప్పాడు.

Adipurush : ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహిస్తున్న హనుమాన్ టీం.. ప్రశాంత్ వర్మ డైరెక్షన్, తేజ సజ్జ యాంకరింగ్..

సిద్దార్థ్ మాట్లాడుతూ.. “విమర్శించడం, ప్రశ్నించడం అనే పదం చాలా కామెడీ అయ్యిపోయింది. నేను ఎప్పుడు నిజమే మాట్లాడుతూ వచ్చాను. అయితే నన్ను సపోర్ట్ చేయకపోయినా, ఒక నిజం గురించి నాతోటి ప్రజలు మాట్లాడ లేదు, నాతోటి సహనటులు మాట్లాడ లేదు. ఇక నేను ఒక్కడినే ఎందుకు వారంతా ఎందుకు మాట్లాడం లేదని కూడా ఎవరు ప్రశ్నించలేదు. కానీ అలా మాట్లాడి నేను ఎన్నో సమస్యలు ఎదురుకున్నా నేను మాత్రం వెనక్కి తగ్గలేదు. అయితే నన్ను నమ్మి సినిమా తీస్తున్న నిర్మాతలు దాని వల్ల ఇబ్బంది పడుతున్నారు. అందుకనే నేను మాట్లాడడం ఆపాలని అనుకున్నాను. అందుకే ట్విట్టర్ నుంచి బయటకి రావాల్సి వచ్చింది” అంటూ చెప్పుకొచ్చాడు.

Sumalatha : సుమలత కొడుకు పెళ్ళిలో పాన్ ఇండియా స్టార్స్ రజనీకాంత్‌, యశ్.. ఫోటోలు!

కాగా సిద్దార్థ్ ట్విట్టర్ నుంచి వెళ్ళిపోడానికి కారణం తోటి హీరోలు, నటులే తనని సపోర్ట్ చేయకపోవడమే అంటూ అప్పటిలో కథనాలు వచ్చాయి. ఇక ఇప్పుడు సిద్దార్థ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక టక్కర్ మూవీ విషయానికి వస్తే.. రొమాంటిక్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కింది. మజిలీ ఫేమ్ దివ్యంషా కౌశిక్ (Divyansha Kaushik) హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ట్రైలర్ లో వీరిద్దరూ చేసిన రొమాన్స్ మూవీ పై ఆసక్తిని కలగజేస్తుంది.