Oy Re Release : రీ రిలీజ్‌కి సిద్దమైన ‘ఓయ్’.. డైరెక్టర్‌ని తిట్టేసిన నెటిజెన్.. దర్శకుడు రిప్లై..

'ఓయ్' రీ రిలీజ్‌ విషయాన్ని తెలియజేస్తూ పోస్టు వేసిన డైరెక్టర్ ని తిట్టిన నెటిజెన్. దర్శకుడు రిప్లైతో మీమ్స్..

Siddharth Shamili Oy movie Re Release date update

Oy Re Release : సిద్దార్థ్ హీరోగా, షామిలి హీరోయిన్‌గా నటించిన లవ్ డ్రామా ఫిలిం ‘ఓయ్’. ఆనంద్ రంగ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం 2009లో రిలీజ్ అయ్యింది. అమెరికన్ మూవీ ‘ఏ వాక్ టు రిమెంబర్’ స్టోరీని బేస్ చేసుకొని ఈ చిత్రం తెరకెక్కింది. నెగటివ్ ఎండింగ్ తో వచ్చిన ఈ సినిమా అప్పటిలో పెద్దగా విజయం సాధించలేక పోయింది. కానీ ఆ తరువాత జనరేషన్ లో మాత్రం.. ఈ సినిమాకి మంచి క్రేజ్ లభించింది. కల్ట్ లవ్ స్టోరీస్ లో ఈ సినిమా కూడా ఒకటిగా నిలిచింది.

దీంతో ఈ సినిమా రీ రిలీజ్ కోసం చాలామంది యూత్ ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా దర్శకుడికి, నిర్మాత డివివికి అనేక రిక్వెస్ట్ లు వెళ్ళేవి. ఇక ఈ రిక్వెస్ట్ లు అన్ని చూసిన మేకర్స్.. ఈ సినిమా రీ రిలీజ్ కి సిద్ధం చేసేశారు. ఈ వాలంటైన్ డే నాడు ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేయబోతున్నారు. ఫిబ్రవరి 14న వరల్డ్ వైడ్ గా ఈ సినిమాని మరోసారి ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తున్నారు.

Also read : Ambajipeta Marriage Band : ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ రివ్యూ.. బ్యాండ్ మేళం సౌండ్ గట్టిగానే వినిపిస్తుంది..

ఇక ఈ విషయాన్ని తెలియజేస్తూ దర్శకుడు ఒక పోస్ట్ వేశారు. ఆ పోస్టుకి ఓ నెటిజెన్ రియాక్ట్ అవుతూ.. ‘ఒరేయ్ గుండు నాయాల, ఇలాంటి మంచి సినిమా తీసి ఎటు పోయావురా’ అంటూ ట్వీట్ చేసింది. ఇక దానికి దర్శకుడు.. స్మైల్ ఎమోజితో రిప్లై ఇచ్చారు. దానికి ఆ నెటిజెన్ రియాక్ట్ అవుతూ.. ‘సారీ సార్ అలా పిలిచినందుకు’ అని కామెంట్ చేయగా, దర్శకుడు దానిని స్పోర్టివ్ గా తీసుకోని.. ‘ఏం పర్వాలేదు. కానీ నువ్వు అన్నది నిజమే’ అంటూ రిప్లై ఇచ్చారు.

ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. దర్శకుడు రిప్లై ఇవ్వడేమో అనుకోని నెటిజెన్ అలా కామెంట్ చేసినట్లు మరో పోస్టు కూడా వేసింది. కాగా ఈ దర్శకుడు ఈ సినిమాతోనే డైరెక్టర్ గా కెరీర్ స్టార్ట్ చేశారు. అయితే ఆ తరువాత మళ్ళీ మరో సినిమా చేయలేదు. శ్రీకాంత్ అండ్ ప్రకాష్ రాజ్ తో 2020లో ఒక వెబ్ సిరీస్ తెరకెక్కించారు. అలాగే ఒక రెండు సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. త్వరలోనే మళ్ళీ దర్శకుడిగా ఆడియన్స్ ముందుకు వస్తానని చెప్పుకొచ్చారు.

ట్రెండింగ్ వార్తలు