Tillu Square : ఇదే ఊపు కొనసాగితే టిల్లు గాడు 100 కోట్లు కొట్టేస్తాడు.. ఇప్పటికి ‘టిల్లు స్క్వేర్’ కలెక్షన్స్ ఎన్ని కోట్లో తెలుసా?
టిల్లు స్క్వేర్ సినిమా థియేటర్స్ లో మోత మోగుతుంది.
- Saketh U
- Updated on- April 7, 2024 / 11:04 AM IST
Siddhu Jonnalagadda Anupama Parameswaran Tillu Square Movie five days Collections
Tillu Square Collections : సిద్ధూ జొన్నలగడ్డ(Siddhu Jonnalagadda), అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) జంటగా మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన టిల్లు స్క్వేర్ సినిమా థియేటర్స్ లో మోత మోగుతుంది. డీజే టిల్లు క్యారెక్టర్ మీద ఉన్న హైప్ తో టిల్లు స్క్వేర్ తీసుకురాగా ఈ సినిమా కూడా జనాలకు బాగా నచ్చేసింది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ లో తెరకెక్కిన టిల్లు స్క్వేర్ సినిమా భారీ విజయం సాధించింది.
టిల్లు స్క్వేర్ సినిమా మార్చ్ 29న రిలీజయింది. మొదటి రోజే 28 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది ఈ సినిమా. నిన్నటి వరకు అయిదు రోజుల్లో టిల్లు స్క్వేర్ సినిమా ఏకంగా 85 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. తాజాగా మూవీ యూనిట్ అధికారికంగా ఈ కలెక్షన్స్ ప్రకటించారు. త్వరలోనే 100 కోట్లు కలెక్ట్ చేయడం పక్కా అంటున్నారు. ఇదే ఊపు కొనసాగితే కచ్చితంగా టిల్లు గాడు 100 కోట్లు కొట్టేస్తాడు.
Also Read : Nav Deep : డ్రగ్స్ కేసు గురించి మాట్లాడిన నవదీప్.. ప్రతిసారి నన్ను తీసుకెళ్తారు అంటూ..
అమెరికాలో కూడా టిల్లు స్క్వేర్ దూసుకుపోతుంది. ఇప్పటికే అమెరికాలో 2 మిలియన్ డాలర్స్ పైగా వసూలు చేసింది. టిల్లు స్క్వేర్ 28 కోట్లు షేర్ కలెక్షన్స్ వస్తే బ్రేక్ ఈవెన్ అయినట్టే. ఇప్పటికి టిల్లు స్క్వేర్ సినిమా 40 కోట్లకు పైగా షేర్ సాధించి ఫుల్ ప్రాఫిట్స్ లో ఉంది. ఈ రేంజ్ విజయంపై చిత్రయూనిట్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా టిల్లు క్యూబ్ కూడా ప్రకటించారు మూవీ యూనిట్.
