Nav Deep : డ్రగ్స్ కేసు గురించి మాట్లాడిన నవదీప్.. ప్రతిసారి నన్ను తీసుకెళ్తారు అంటూ..

నవదీప్ ని పలు మార్లు పలు డ్రగ్స్ కేసుల్లో విచారించారు పోలీసులు. తాజాగా లవ్ మౌళి ప్రమోషన్స్ లో ఈ డ్రగ్స్ కేసు గురించి ప్రస్తావన రావడంతో మరోసారి దీని గురించి మాట్లాడాడు.

Nav Deep : డ్రగ్స్ కేసు గురించి మాట్లాడిన నవదీప్.. ప్రతిసారి నన్ను తీసుకెళ్తారు అంటూ..

Nav Deep gives clarity on Every Time his name in Tollywood Drugs Case

Nav Deep : ఒకప్పుడు హీరోగా మంచి విజయాలు సాధించిన నవదీప్ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తున్నాడు. చాలా గ్యాప్ తర్వాత నవదీప్ మళ్ళీ హీరోగా ‘లవ్ మౌళి’ అనే సినిమాతో ఏప్రిల్ 19న రాబోతున్నాడు. ఇప్పటికే రిలీజయిన లవ్ మౌళి గ్లింప్స్ తో సినిమాపై ఆసక్తి పెంచాడు. అయితే నవదీప్ తన సినిమాల కన్నా డ్రగ్స్ కేసుల్లో పేరు ఉండటంతో బాగా వైరల్ అయ్యాడు. గతంలో అనేక సార్లు ఎప్పుడు టాలీవుడ్ మీద డ్రగ్స్ కేసు వచ్చినా అందులో నవదీప్ పేరు వినపడేది.

నవదీప్ ని పలు మార్లు పలు డ్రగ్స్ కేసుల్లో విచారించారు పోలీసులు. ఇప్పటికే నేనేమి డ్రగ్స్ వాడలేదు, వాళ్ళు పిలిచారు, వెళ్ళాను, పోలీసులు అడిగిన దానికి సమాధానాలు చెప్పాను అంటూ క్లారిటీ ఇచ్చాడు నవదీప్. తాజాగా లవ్ మౌళి ప్రమోషన్స్ లో ఈ డ్రగ్స్ కేసు గురించి ప్రస్తావన రావడంతో మరోసారి దీని గురించి మాట్లాడాడు.

Also Read : Nikkhil Advani : బాలీవుడ్‌లో ఐక్యత లేదు.. బాలీవుడ్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.. కానీ సౌత్‌లో..

నవదీప్ మాట్లాడుతూ.. నాకు నైట్ క్లబ్ ఉండేది. దాని వల్ల మొదట నన్ను పిలిచారు. ఒక పేరుని పదే పదే వినిపిస్తే అందరూ అదే పేరుని వాడతారు. అలా ఆ కేసులో సినిమా వాళ్ళు ఉన్నారు అని వస్తే నా పేరు వినిపిస్తుంది అంతే కానీ అందులో రియాలిటీ లేదు. ఆ సమయంలో చాలా స్ట్రెస్ అయ్యాను, ఇబ్బంది పడ్డాను. ఇంట్లో వాళ్ళు కూడా బాధపడ్డారు. ఇదంతా ఎలా ఉంటుందంటే క్లాస్ లో ఏదన్నా గొడవ జరిగి లాస్ట్ బెంచ్ వాడు దొరికితే ఇక ప్రతిసారి గొడవ జరిగినప్పుడల్లా మళ్ళీ అదే లాస్ట్ బెంచ్ స్టూడెంట్ నే అంటారు. అలాగే డ్రగ్స్ కేసు అన్నప్పుడల్లా నన్ను ఇన్వెస్టిగేషన్ కి తీసుకెళ్తుంటారు. అంతే తప్ప నా ప్రమేయం ఎప్పుడూ లేదు. ఇన్ని సార్లు జరిగాక ప్రేక్షకులు కూడా రియలైజ్ అయ్యారు. ఇవన్నీ వార్తలే, నిజాలు లేవు అని. ఇకపై నా పేరు అసలు వినపడదు. నా పని, నా సినిమాలు నేను చేసుకుంటాను అని అన్నాడు.