Nikkhil Advani : బాలీవుడ్‌లో ఐక్యత లేదు.. బాలీవుడ్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.. కానీ సౌత్‌లో..
తాజాగా బాలీవుడ్ దర్శక నిర్మాత నిఖిల్ అద్వానీ సౌత్, బాలీవుడ్ ని కంపేర్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేసారు.

Bollywood Director Nikkhil Advani Sensational Comments while Comparing South and Bollywood Film Industries
Nikkhil Advani : కరోనా తర్వాత నుంచి సౌత్ సినీ పరిశ్రమ మంచి విజయాలు సాధిస్తూ, భారీ సినిమాలు తీస్తూ, అరుదైన గౌరవాలు సాధిస్తూ దూసుకెళ్తుంది. అంతేకాక సౌత్ సినిమాలు బాలీవుడ్(Bollywood) లో కూడా మంచి విజయాలు సాధిస్తున్నాయి. ఇదే సమయంలో బాలీవుడ్ లో చెప్పుకోదగ్గ హిట్ సినిమాలు ఎక్కువగా రావట్లేదు. దీంతో ఇటీవల అందరూ బాలీవుడ్, సౌత్ పరిశ్రమలని కంపేర్ చేసి చూస్తున్నారు.
తాజాగా బాలీవుడ్ దర్శక నిర్మాత నిఖిల్ అద్వానీ సౌత్, బాలీవుడ్ ని కంపేర్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేసారు. కల్ హో నహో, సలాం ఏ ఇష్క్, చాందిని చౌక్ టు చైనా, డి డే.. లాంటి సూపర్ హిట్ సినిమాలతో దర్శకుడిగా సక్సెస్ అయ్యారు నిఖిల్ అద్వానీ. మరో పక్క నిర్మాతగా కూడా సినిమాలు చేస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నిఖిల్ అద్వానీ సౌత్, బాలీవుడ్ పరిశ్రమలని కంపేర్ చేస్తూ మాట్లాడాడు.
Also Read : Love Mouli : అక్కడ షూట్ చేసిన మొదటి తెలుగు సినిమా ఇదే.. లాక్‌డౌన్ లో సినిమా కోసం నవదీప్ కష్టం..
నిఖిల్ అద్వానీ మాట్లాడుతూ.. సౌత్ సినీ పరిశ్రమ, ముఖ్యంగా తెలుగు, తమిళ్ లో వర్క్ లో ప్రొఫెషనలిజం ఉంటుంది. హిందీ సినీ పరిశ్రమలో ఐక్యత లేదు. అందరూ ఒకరికొకరు పోటీ పడాలని చూస్తారు. ఒకరు సక్సెస్ కొడితే ఇంకొకరు ఇక్కడ సెలబ్రేట్ చేసుకోరు. బాలీవుడ్ లో మన అందరం ముందుకొచ్చి మనమంతా ఒక్కటే అని చెప్పగలగాలి. సౌత్ పరిశ్రమలతో పోలిస్తే మనలో ఐక్యత చాలా తక్కువ అని అన్నారు. దీంతో నిఖిల్ చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ లో చర్చగా మారాయి.