Love Mouli : అక్కడ షూట్ చేసిన మొదటి తెలుగు సినిమా ఇదే.. లాక్‌డౌన్ లో సినిమా కోసం నవదీప్ కష్టం..
నవదీప్ లవ్ మౌళి సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నవదీప్ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు.

Navdeep Reveals So many Interesting things about Love Mouli Movie
Love Mouli : చాలా రోజుల తర్వాత నవదీప్ మళ్ళీ హీరోగా ఓ సినిమాతో రాబోతున్నాడు. ‘లవ్ మౌళి’ అనే సినిమాతో నవదీప్(Navdeep) తన కొత్త వర్షన్ చూపిస్తా అంటూ ఏప్రిల్ 19న రాబోతున్నాడు. ఇప్పటికే రిలీజయిన లవ్ మౌళి గ్లింప్స్ తో సినిమాపై ఆసక్తి పెంచాడు. ఈసారి నవదీప్ ఈ సినిమాతో ఏదో ప్రయోగం చేయబోతున్నాడని అర్ధమవుతుంది.
ప్రస్తుతం నవదీప్ లవ్ మౌళి సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నవదీప్ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు.
నవదీప్ మాట్లాడుతూ.. లవ్ మౌళి సినిమా 99 శాతం షూటింగ్ మేఘాలయ రాష్ట్రంలోనే చేసాము. అసలు మన ఇండియాలో ఆ రేంజ్ లొకేషన్స్ ఉన్నాయా అని ఆశ్చర్యపోయాము. అక్కడ ఫస్ట్ షూట్ చేసిన తెలుగు సినిమా ఇదే. బాలీవుడ్ ఒక సినిమా చేసింది. తమిళ్ లో రెండు మూడు సినిమాలు మేఘాలయాలో కొన్ని ప్రదేశాల్లో కొంత భాగం షూట్ చేసాయి. కానీ మొత్తం సినిమా షూట్ మేఘాలయాలో ఇండియా వైడ్ చూసుకున్నా మాదే మొదటి సినిమా అని తెలిపాడు.
Also Read : Chiranjeevi – Savitri : సావిత్రితో చిరంజీవి చేసింది రెండు సినిమాలే.. ఏమేం సినిమాలంటే.. సావిత్రి అడగ్గానే..
అలాగే.. లాక్ డౌన్ లో అక్కడే ఉన్నాము. ఓ రిసార్ట్ లో ఉండిపోయాము. దీంతో రిసార్ట్ లోపలే కొన్ని సెట్స్ వేసుకొని షూటింగ్ చేసాము. కొన్ని రోజుల తర్వాత అక్కడ తెలుగు ఆఫీసర్స్ ఉంటే వాళ్ళ ద్వారా పర్మిషన్స్ ట్రై చేసి అక్కడి నుంచి బయట పడ్డాము. మేఘాలయాలో మొత్తం మేఘాలే ఉంటాయి. ఇక చిరపుంజి అయితే వర్షమే ఉంటుంది. అలాంటి అన్ని లొకేషన్స్ లో లైటింగ్ కష్టమైనా షూట్ చేసాము అని తెలిపాడు నవదీప్.