×
Ad

Tillu Square : వామ్మో.. ‘టిల్లు స్క్వేర్’ ప్రీ రిలీజ్ బిజినెస్ అన్ని కోట్లా? బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఎన్ని కోట్లు కలెక్ట్ చేయాలి?

టిల్లు స్క్వేర్ ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు.

  • Published On : March 28, 2024 / 08:55 PM IST

Siddhu Jonnalagadda Anupama Parameswaran Tillu Square Movie Theatrical Business Details

Tillu Square : సిద్ధూ జొన్నలగడ్డ(Siddhu Jonnalagadda), అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) జంటగా మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా టిల్లు స్క్వేర్. సిద్దు జొన్నలగడ్డ డీజే టిల్లు సినిమాకి సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కింది. డీజే టిల్లు భారీ హిట్ అయి సిద్ధూని ఓవర్ నైట్ స్టార్ ని చేసింది. దాంతో టిల్లు స్క్వేర్ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్స్ , సాంగ్స్ తో మంచి హోప్స్ ఉన్నాయి. టిల్లు స్క్వేర్ సినిమా రేపు మార్చ్ 29న థియేటర్స్ లో రిలీజ్ కానుంది.

అయితే టిల్లు స్క్వేర్ ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. డీజే టిల్లు సినిమాకు 8 కోట్లు బడ్జెట్ అవ్వగా ఆ సినిమా 30 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి భారీ హిట్ కొట్టింది. ఇప్పుడు టిల్లు స్క్వేర్ సినిమాపై ఉన్న హైప్ తో ఏకంగా 27 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగిందని సమాచారం. అంటే ఆల్మోస్ట్ 28 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయినట్టు. అంటే ఆల్మోస్ట్ 55 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేయాలి.

Also Read : Vijay Deverakonda : ఓ పక్కన బుగ్గ గిల్లిన దిల్ రాజు.. మరో పక్క అమ్మాయిల ముద్దులు.. విజయ్ దేవరకొండ హంగామా..

ఒక మీడియం రేంజ్ హీరోకి ఈ రేంజ్ థియేట్రికల్ బిజినెస్ అంటే చాలా ఎక్కువే. కేవలం డీజే టిల్లు సక్సెస్ తో, ఈ సినిమా మీద ఉన్న హైప్ తో టిల్లు స్క్వేర్ సినిమాకి ఈ రేంజ్ లో బిజినెస్ జరిగింది. మరి రేపు థియేటర్స్ లో సిద్ధూ, అనుపమ ఏ రేంజ్ లో మ్యాజిక్ చేస్తారో చూడాలి.