Vijay Deverakonda : ఓ పక్కన బుగ్గ గిల్లిన దిల్ రాజు.. మరో పక్క అమ్మాయిల ముద్దులు.. విజయ్ దేవరకొండ హంగామా..
తిరుపతిలో విజయ్ దేవరకొండని చూడటానికి భారీగా అభిమానులు వచ్చారు.

Vijay Devarakonda Lady Fans Enjoying in Family Star Trailer Launch Event at Tirupati Video goes Viral
Vijay Deverakonda : విజయ్ దేవరకొండ కి యూత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా అమ్మాయిల్లో విజయ్ కి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. త్వరలో ఏప్రిల్ 5న విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమాతో రాబోతున్నాడు. ఇప్పటికే టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. నేడు ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ రిలీజ్ చేసారు. ట్రైలర్ కూడా వైరల్ అయి ట్రెండింగ్ లో ఉంది.
అయితే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నేడు హైదరాబాద్ లో ఉదయం చేయగా, ఇప్పుడు రాత్రి తిరుపతిలో చేస్తున్నారు. తిరుపతిలో విజయ్ దేవరకొండని చూడటానికి భారీగా అభిమానులు వచ్చారు. బైక్ ర్యాలీ కూడా చేసారు. తిరుపతిలోని PJR థియేటర్లో ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని నిర్వహించగా అమ్మాయిలు కూడా భారీగా వచ్చి సందడి చేసారు. అక్కడికి వచ్చిన అమ్మాయిలు గాలిలోనే విజయ్ దేవరకొండకి ముద్దులు విసురుతూ, అరుపులు, విజిల్స్ తో హంగామా చేస్తున్నారు.
Also Read : Spirit Update : సందీప్ వంగ – ప్రభాస్ సినిమా షూటింగ్ కి వెళ్ళేది అప్పుడే.. స్పిరిట్ అప్డేట్..
ఈ కార్యక్రమంలో దిల్ రాజు మాట్లాడుతూ.. విజయ్ కి అమ్మాయిల ఫాలోయింగ్ చాలా ఎక్కువ. ఈ సినిమాలో విజయ్ ని చూసి అమ్మాయిలు అంతా ఫ్లాట్ అవుతారు అని మా ఆవిడ చెప్పింది. ఇక్కడ అమ్మాయిలు విజయ్ ని చూసి హడావిడి ఆపేలా లేరు అంటూ విజయ్ బుగ్గ గిల్లి మరీ చెప్పాడు. దిల్ రాజు విజయ్ బుగ్గ గిల్లడం, ఓ పక్క అమ్మాయిలు విజయ్ కి గాల్లోకి ముద్దులు విసరడంతో ఈ వీడియో వైరల్ గా మారింది. విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు. మొత్తానికి ఈ రౌడీ హీరోకి అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే అని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు.
Ceeded Rowdy Girl's Mass ??@TheDeverakonda #VijayDeverakonda#FamilyStarTrailer #FamilyStar
pic.twitter.com/ce1NNjchKV— Vijay Deverakonda Trends (@VDTrendsOffl) March 28, 2024