Spirit Update : సందీప్ వంగ – ప్రభాస్ సినిమా షూటింగ్ కి వెళ్ళేది అప్పుడే.. స్పిరిట్ అప్డేట్..

సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా 'స్పిరిట్' అనే టైటిల్ తో సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే.

Spirit Update : సందీప్ వంగ – ప్రభాస్ సినిమా షూటింగ్ కి వెళ్ళేది అప్పుడే.. స్పిరిట్ అప్డేట్..

Sandeep Reddy Vanga Prabhas Spirit Movie Shooting Update

Updated On : March 28, 2024 / 7:53 PM IST

Spirit Movie : తీసిన మూడు సినిమాలతోనే భారీ హిట్స్ కొట్టి మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అయ్యాడు, చేతిలో మరో మూడు భారీ సినిమాలు పెట్టుకున్నాడు సందీప్ రెడ్డి వంగ(Sandeep Reddy Vanga). గత సంవత్సరం యానిమల్ సినిమాతో భారీ పాన్ ఇండియా హిట్ కొట్టిన సందీప్ వంగ తన తర్వాత సినిమాని ప్రభాస్(Prabhas) తో చేయబోతున్న సంగతి తెలిసిందే.

ఆల్రడీ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ‘స్పిరిట్’ అనే టైటిల్ తో సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఓ నిజాయితీ గల పోలీసాఫీసర్ కథ అని, యాక్షన్ సీన్స్ కూడా చాలా ఉంటాయని ఇటీవల సందీప్ వంగ చెప్పాడు. అయితే ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. తాజాగా బాలీవుడ్ లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డి వంగ మాట్లాడుతూ.. స్పిరిట్ సినిమా ప్రీ ప్రొడక్షన్ జరుగుతుంది. ఈ సంవత్సరం డిసెంబర్ లో షూటింగ్ మొదలుపెడతాం అని తెలిపారు. దీంతో సందీప్ వ్యాఖ్యలు వైరల్ అవ్వగా ప్రభాస్ అభిమానులు సంతోషిస్తున్నారు.

Also Read : Vishwak Sen : విశ్వక్ సేన్ నెక్స్ట్ సినిమా టైటిల్ ఏంటో తెలుసా? స్టేజిపై లీక్ చేసిన విశ్వక్.. టైటిల్ భలే ఉందే..

ప్రభాస్ త్వరలో కల్కి 2898AD సినిమాతో రాబోతున్నాడు. ఆ తర్వాత ది రాజాసాబ్ సినిమా, ఆ తర్వాత స్పిరిట్ తో వస్తాడు. ఇటీవలే కల్కి షూట్ పూర్తి చేయగా త్వరలో రాజా సాబ్ షూట్ మొదలుపెట్టి దసరా లోపు పూర్తి చేసి అనంతరం డిసెంబర్ లో స్పిరిట్ సినిమా షూట్ మొదలుపెడతారని సమాచారం. ఇలా వరుసగా భారీ లైనప్ పెట్టి అభిమానులని ఆతృతగా ఎదురుచూసేలా చేస్తున్నాడు ప్రభాస్.