Vishwak Sen : విశ్వక్ సేన్ నెక్స్ట్ సినిమా టైటిల్ ఏంటో తెలుసా? స్టేజిపై లీక్ చేసిన విశ్వక్.. టైటిల్ భలే ఉందే..
విశ్వక్ సేన్ నేడు ఓ సినిమా ఈవెంట్ కి రాగా అక్కడ మాట్లాడుతూ తన నెక్స్ట్ సినిమా టైటిల్ రివీల్ చేసాడు.

Vishwak Sen Leaked his Next Movie Title in a Movie Event
Vishwak Sen : విశ్వక్ సేన్ ఫుల్ ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఓ పక్క కమర్షియల్ సినిమాలతోను హిట్స్ కొడుతున్నాడు, మరో పక్క ప్రయోగాత్మక సినిమాలతోను హిట్స్ కొడుతున్నాడు. ఇటీవలే గామి సినిమాతో వచ్చి మంచి విజయం సాధించాడు విశ్వక్ సేన్. త్వరలో మే 17న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో రాబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, సాంగ్స్ రిలీజ్ అయి బాగా వైరల్ అవ్వడంతో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా తర్వాత రాబోయే నెక్స్ట్ సినిమా టైటిల్ రేపు రిలీజ్ చేస్తామని అధికారికంగా నేడు ఓ పోస్టర్ రిలీజ్ చేశారు మూవీ యూనిట్. కానీ విశ్వక్ సేన్ నేడు ఓ సినిమా ఈవెంట్ కి రాగా అక్కడ మాట్లాడుతూ తన నెక్స్ట్ సినిమా టైటిల్ రివీల్ చేసాడు. విశ్వక్ సేన్ నెక్స్ట్ సినిమా టైటిల్ ‘మెకానిక్ రాకీ’ అని రివీల్ చేసాడు. టైటిల్ అనౌన్స్ రేపు పెట్టుకొని ఇవాళ స్టేజిపై వేరే ఈవెంట్లో రివీల్ చేయడంతో విశ్వక్ సేన్ నెక్స్ట్ సినిమా టైటిల్ వైరల్ గా మారింది. ఇక మెకానిక్ రాకీ లవ్, కామెడీ జానర్ లో ఉండబోతుందని సమాచారం.
Also Read : Sasivadane : అమ్మాయి కోసం వెతికేస్తున్న హీరో.. ‘శశివదనే’ నుంచి కొత్త సాంగ్ విన్నారా?
ఈ మెకానిక్ రాకీ సినిమా SRT ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రవితేజ ముళ్ళపూడి దర్శకత్వంలో తెరకెక్కుతుండగా ఇందులో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించనుంది.
Get ready for a real fun ride! ??#VS10 Title & First Look poster will be out Tomorrow @ 11:11 am#ProductionNo7@VishwakSenActor @Meenakshiioffl @itsRamTalluri @RaviTejaDirects @JxBe @SRTmovies @manojhreddydop @anwaraliedit pic.twitter.com/RFM6UeRSQs
— VishwakSen (@VishwakSenActor) March 28, 2024