Siddhu Jonnalagadda : షూటింగ్‌లో సిద్ధూకి గాయాలు.. అయినా నెక్స్ట్ డే షూటింగ్.. ఫస్ట్ టైం భారీ యాక్షన్ సినిమా..
బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా 'జాక్' అనే సినిమాని ప్రకటించారు.
- Saketh U
- Published On : March 24, 2024 / 10:49 AM IST
Siddhu Jonnalagadda Injured in Bommarillu Baskar Movie Shooting
Siddhu Jonnalagadda : డీజే టిల్లుతో(DJ Tillu) ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు సిద్ధూ జొన్నలగడ్డ. ఆ సినిమాతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకోవడమే కాక వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. త్వరలో మార్చ్ 29న టిల్లు స్క్వేర్ సినిమాతో రాబోతున్నాడు. ఇటీవల సిద్ధూ తన బర్త్ డే రోజున తన నెక్స్ట్ సినిమాల అప్డేట్స్ కూడా ఇచ్చాడు.
బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా ‘జాక్’ అనే సినిమాని ప్రకటించారు. BVSN ప్రసాద్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుండగా వైష్ణవి చైతన్య ఇందులో హీరోయిన్ గా నటిస్తుందని సమాచారం. ఈ సినిమా యాక్షన్ ఓరియెంటెడ్ గా ఉంటుందని తెలుస్తుంది. జాక్ సినిమాలో భారీ యాక్షన్ సీన్స్ ఉన్నాయని సమాచారం. తాజాగా టిల్లు స్క్వేర్ ప్రమోషన్స్ లో సిద్ధూ జొన్నలగడ్డ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో జాక్ సినిమా గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు.
సిద్ధూ జొన్నలగడ్డ మాట్లాడుతూ.. బొమ్మరిల్లు భాస్కర్ సినిమాలో ఫస్ట్ టైమ్ ఫుల్ లెంగ్త్ యాక్షన్ ట్రై చేస్తున్నాను. రోప్ సహాయంతో పై నుంచి దూకడం, ఫైట్స్ చేయడం, ఫైరింగ్.. ఇలా చాలానే ఉన్నాయి. వీటివల్ల గాయాలు కూడా అయ్యాయి. కానీ అదే గాయాలతో మళ్ళీ నెక్స్ట్ డే షూటింగ్ కి వెళ్తున్నాను. కానీ ఈ రేంజ్ యాక్షన్ సన్నివేశాలు ఫస్ట్ టైం చేస్తుండటంతో హ్యాపీగా ఉంది. యాక్షన్ తో పాటు ఫన్ కూడా ఉంది ఈ సినిమాలో. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తయింది. త్వరలో నెక్స్ట్ షెడ్యూల్ షూటింగ్ నేపాల్ లో జరగనుంది అని తెలిపారు. దీంతో గాయాలైనా సినిమా షూటింగ్ కి కంటిన్యూగా వెళ్తుడటంతో సినిమాపై సిద్ధూకి ఉన్న ప్రేమని చూసి అభినందిస్తున్నారు.
