Siddhu Jonnalagadda : బుట్టబొమ్మ కోసం రాబోతున్న డీజే టిల్లు..

ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న చిత్రయూనిట్ తాజాగా బుట్టబొమ్మ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించనుంది. బుట్టబొమ్మ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిబ్రవరి 2న పార్క్ హయత్ హోటల్, హైదరాబాద్ లో సాయంత్రం 6 గంటల నుండి

Siddhu Jonnalagadda is the cheif guest for Buttabomma Pre Release Event

Siddhu Jonnalagadda :  సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో అనికా సురేంద్రన్, సూర్య వశిష్ట, అర్జున్ దాస్ ముఖ్య పాత్రల్లో శౌరి చంద్రశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా బుట్టబొమ్మ. మలయాళం కప్పేలా సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతుంది ఈ సినిమా. ఇటీవల రిపబ్లిక్ డేకి విడుదల చేద్దామనుకున్న ఈ సినిమా వాయిదా పడి ఫిబ్రవరి 4న రిలీజ్ కానుంది. గత కొన్ని రోజులుగా చిత్రయూనిట్ సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు.

తెలుగు, తమిళ్, మలయాళం సినిమాల్లో బాలనటిగా మెప్పించిన అనికా సురేంద్రన్ ఈ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇక తమిళ సినిమాలతో, తన బేస్ వాయిస్ తో తెలుగు వాళ్లకు కూడా దగ్గరైన అర్జున్ దాస్ ఇందులో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న చిత్రయూనిట్ తాజాగా బుట్టబొమ్మ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించనుంది.

Pathaan Collections : ఆరు రోజుల్లో 600 కోట్లు.. వీక్ డేస్ లో కూడా పఠాన్ వసూళ్లు తగ్గట్లేదుగా..

బుట్టబొమ్మ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిబ్రవరి 2న పార్క్ హయత్ హోటల్, హైదరాబాద్ లో సాయంత్రం 6 గంటల నుండి జరగనుంది. ఈ ఈవెంట్ కి చిత్రయూనిట్ అంతా రానున్నారు. ఇక బుట్టబొమ్మ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి డీజే టిల్లు హీరో సిద్ధూ జొన్నలగడ్డ ముఖ్య అతిథిగా రాబోతున్నాడు. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. దీంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి ఏర్పడింది. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి విశ్వక్ సేన్ వచ్చి సందడి చేశాడు.