JACK Teaser : సిద్ధూ జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య జాక్ టీజర్ చూశారా? హీరో ఏం పని చేస్తాడో తెలుసా?

తాజాగా నేడు సిద్ధూ జొన్నలగడ్డ పుట్టిన రోజు కావడంతో జాక్ టీజర్ రిలీజ్ చేసారు.

Siddhu Jonnalagadda Vaishnavi Chaitanya Jack Teaser Released

JACK Teaser : స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ వరుస హిట్స్ తో ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే. త్వరలో జాక్ అనే సినిమాతో రాబోతున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఈ జాక్ సినిమా తెరకెక్కుతుంది. వైష్ణవి చైతన్య ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది.

Also Read : Oka Pathakam Prakaram : ‘ఒక పథకం ప్రకారం’ మూవీ రివ్యూ.. సాయి రామ్ శంకర్ కంబ్యాక్ ఇచ్చాడా?

తాజాగా నేడు సిద్ధూ జొన్నలగడ్డ పుట్టిన రోజు కావడంతో జాక్ టీజర్ రిలీజ్ చేసారు. ఈ టీజర్ లో.. సీనియర్ నటుడు నరేష్, సిద్దు మధ్య వచ్చే తండ్రీ కొడుకుల స‌న్నివేశాలు, హీరోల పాత్రలోని డిఫరెంట్ షేడ్స్, అసలు హీరో ఏంటి? ఏ ఉద్యోగం చేస్తున్నాడు? అతని లక్ష్యం ఏంటి? అతని ప్రేమ కథ ఏంటి అన్నట్టు చూపించారు. హీరో ఏం పనిచేస్తాడో సినిమాలో అని ఆసక్తి నెలకొల్పేలా చేసారు. టీజర్ చూస్తుంటే కామెడీ యాక్షన్ సినిమా అని తెలుస్తుంది. మీరు కూడా జాక్ టీజర్ చూసేయండి..

ఇక ఈ జాక్ సినిమా ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది. ఈ సినిమాతో సిద్ధూ తన హిట్స్ ని కంటిన్యూ చేస్తాడేమో చూడాలి.