Sidharth and kiara attend an event and kiara shares her feelings about marriage with sidharth
#SidKiara : బాలీవుడ్ స్టార్ లవ్ కపుల్ సిద్దార్థ్ మల్హోత్రా-కియారా అద్వానీ ఇటీవలే ఫిబ్రవరి 7న జైసల్మీర్ లో వివాహం చేసుకున్నారు. గత కొన్ని నెలలుగా ప్రేమలో ఉన్నారని వార్తలు వచ్చినా వీరు దానిపై స్పందించకుండా ఇటీవల సైలెంట్ గా పెళ్లి చేసుకొని అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఫిబ్రవరి 7న సిద్దార్థ్-కియారా జైసల్మీర్ లో కేవలం కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది బాలీవుడ్ ప్రముఖుల మధ్య వివాహం చేసుకున్నారు.
సిద్దార్థ్-కియారా వివాహం తర్వాత ఢిల్లీలో కుటుంబ సభ్యులు, బంధువుల కోసం ఒక రిసెప్షన్, ముంబైలో బాలీవుడ్ కోసం ఒక రిసెప్షన్ వేడుక చేసుకున్నారు. దీంతో ఈ కొత్త జంటకి ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇన్ని రోజులు పెళ్లి హంగామాని ఎంజాయ్ చేసి ఇటీవలే బ్యాక్ టు వర్క్ అయ్యారు సిద్దార్థ్-కియారా.
తాజాగా సిద్దార్థ్-కియారా కలిసి ఓ అవార్డు వేడుకకు హాజరయ్యారు. దీంతో ఈ వేడుకలో యాంకర్ కియారాని సిద్దార్థ్ ని పెళ్లి చేసుకునే సమయంలో మీరు ఎలా ఫీల్ అయ్యారు అని అడిగారు. కియారా స్టేజి మీద మాట్లాడుతూ.. పెళ్లి సమయంలో చాలా భావోద్వేగానికి లోనయ్యాను. చాలా ఆనందం వేసింది. పెళ్లి మండపానికి నేను నడిచి వస్తుంటే అక్కడ పెళ్లి పీటల మీద కూర్చొని ఉన్న సిద్దార్దని చూడగానే మనసులో.. యా.. నాకు కూడా పెళ్లి అయిపోతుంది అని అనుకున్నాను. నాకే కాదు ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఎవరికైనా ఇంతే ఆనందం ఉంటుందేమో అని చెప్పింది.
Kiara Advani : పెళ్లి హంగామా ముగిసింది.. బ్యాక్ టు వర్క్ అంటూ కియారా స్పెషల్ సెల్ఫీ…
అలాగే సిద్దార్థ్ కూడా మాట్లాడుతూ.. ఇక్కడికి నా కో-స్టార్, నేను తనని పెళ్లి చేసుకునేలా అద్భుతంగా కన్విన్స్ చేసిన నా భార్యతో వచ్చినందుకు చాలా సంతోషంగా అంది అని అన్నాడు. ఇక ఈ అవార్డు వేడుకలో ఈ కొత్త జంట స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఈవెంట్ కి వచ్చిన వాళ్లంతా సిద్దార్థ్-కియారాకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక సిద్దార్థ్ కియారాని స్టేజి మీద హగ్ చేసుకున్నాడు. దీంతో ఈ ఈవెంట్ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
no one like them, truly the most loved couple #sidkiara ❤️? pic.twitter.com/T1e7lM30WK
— mr & mrs malhotra (@sidkiarafp) February 26, 2023