×
Ad

Vanara Teaser : ‘వానర’ టీజర్ రిలీజ్.. బండి కోసం వానరులు ఇంత పోరాటమా? నందు విలన్ గా..

మంచు మనోజ్ చేతుల మీదుగా వానర టీజర్ రిలీజ్ చేసారు. (Vanara Teaser)

Vanara Teaser

Vanara Teaser : అవినాశ్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా తెరకెక్కిస్తున్న సినిమా ‘వానర’. ఈ సినిమాలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తుండగా నందు విలన్ గా నటిస్తున్నాడు. సోషియో ఫాంటసీ కథతో హనుమంతుడు, వానరులు బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా రానుంది.(Vanara Teaser)

శంతను పతి సమర్పణలో సిల్వర్ స్క్రీన్ సినిమాస్ బ్యానర్ పై అవినాశ్ బుయానీ, ఆలపాటి రాజా, సి.అంకిత్ రెడ్డి నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి తాజాగా టీజర్ రిలీజ్ చేసారు. మంచు మనోజ్ చేతుల మీదుగా టీజర్ రిలీజ్ చేసారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించనున్నారు.

Also See : Samyuktha – Aniruda Srikkanth : రెండో పెళ్లి చేసుకున్న CSK మాజీ క్రికెటర్ – నటి.. ఫొటోలు వైరల్..

ఈ టీజర్ లో.. హీరో బైక్ పోతే దాని కోసం ఎంత పెద్ద యుద్ధమే చేసాడు అన్నట్టు రామాయణంలోని వానర జాతిని కంపేర్ చేస్తూ చూపించారు. ఈ సినిమాలో కూడా హనుమంతుడి రిఫరెన్స్ ఉందనున్నట్టు తెలుస్తుంది. మీరు కూడా వానర టీజర్ చూసేయండి..