Singeetham Srinivasa Rao : ఆదిత్య 369 సీక్వెల్ కథ రెడీ.. బాలకృష్ణ ఎప్పుడంటే అప్పుడే.. ‘ప్రాజెక్టు K’లో ఆ మార్పులు చేశాను..

తాజాగా ఆదిత్య సీక్వెల్ పై సింగీతం శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ''ఆ సినిమాకి సీక్వెల్ అనుకున్నాము. ఆదిత్య 999 టైటిల్ కూడా అనుకున్నాం. బాలకృష్ణకు కూడా చేయాలని ఉంది. ఆయన ఎప్పుడు అంటే అప్పుడు....................

Singeetam Srinivasa Rao comments on Aditya 369 Sequel

Singeetham Srinivasa Rao :  ఎన్నో సూపర్ హిట్ సినిమాలని అందించిన ప్రముఖ సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు గత కొన్నేళ్లుగా సినిమాలకి దూరంగా ఉంటున్నారు. కానీ సినీ పరిశ్రమకి మాత్రం దగ్గరగానే ఉంటున్నారు. మంచి సినిమాలని మెచ్చుకుంటూ, సినిమా వాళ్లకి టచ్ లో ఉంటూ, అప్పుడప్పుడు ఇంటర్వ్యూలు ఇస్తూ 92 ఏళ్ళ వయసులో కూడా చాలా యాక్టీవ్ గా ఉన్నారు సింగీతం శ్రీనివాసరావు. తాజాగా అలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చిన ఆయన పలు ఆసక్తికర విషయాలని షేర్ చేసుకున్నారు.

సింగీతం శ్రీనివాసరావు ఆయన గత సినిమాల గురించి, అప్పటి జ్ఞాపకాల గురించి, ఆయన అనుభవాల గురించి ఈ కార్యక్రమంలో మాట్లాడారు. అలాగే ఈ కార్యక్రమంలో ఆదిత్య 369 సీక్వెల్ గురించి కూడా మాట్లాడారు. బాలకృష్ణతో సింగీతం ఆదిత్య 369 సినిమా తీసి భారీ విజయం అందుకున్నారు. గతంలో ఈ సినిమాకి సీక్వెల్ చేస్తా అని, మోక్షజ్ఞ హీరో అని అన్నారు. బాలకృష్ణ కూడా దీనిపై గతంలో వ్యాఖ్యలు చేశారు.

Rajinikanth : నేను చిన్న క్యారెక్టర్ అడిగినా మణిరత్నం ఇవ్వలేదు.. నేను, కమల్‌, శ్రీదేవి, విజయ్‌ కాంత్‌లతో ఈ సినిమా తీద్దాం అనుకున్నాం..

తాజాగా ఆదిత్య సీక్వెల్ పై సింగీతం శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ”ఆ సినిమాకి సీక్వెల్ అనుకున్నాము. ఆదిత్య 999 టైటిల్ కూడా అనుకున్నాం. బాలకృష్ణకు కూడా చేయాలని ఉంది. ఆయన ఎప్పుడు అంటే అప్పుడు ఆ సినిమా చేస్తాం. కథ కూడా రెడీగా ఉంది” అని తెలిపారు. ఇక ప్రభాస్‌ ‘ప్రాజెక్ట్ k’ సినిమా గురించి మాట్లాడుతూ.. ”ఈ సినిమాకి అశ్వినీదత్‌ నన్ను మెంటర్‌గా ఉండమన్నారు. సినిమాలో నేను భాగం కాను కానీ కేవలం స్క్రిప్టు వరకు కొన్ని మార్పులు చెప్పాను” అన్నారు. దీంతో బాలయ్య అభిమానులు ఆదిత్య 369 సీక్వెల్ త్వరగా తీయాలని ఆశిస్తున్నారు.