Singer Aditi Bhavaraju silver screen entry Dandora movie
సింగర్ అదితి భావరాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన గాత్రంతో ఆడియన్స్‌లో మదిలో తనదైన ముద్ర వేసిన అమ్మడు ఇప్పుడు నటిగా రాణించాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే దండోరా అనే చిత్రంలో ఆమె నటిస్తోంది. మురళీకాంత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై రవీంద్ర బెనర్జీ ముప్పనేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, మనికా చిక్కాల, మౌనికా రెడ్డి, బిందు మాధవి, రాధ్య తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గామీణ తెలంగాణ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. మార్క్ కె.రాబిన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
Allu Arjun-Atlee : అల్లు అర్జున్-అట్లీ మూవీలో మెగాస్టార్..?
ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల విడుదల ఈ చిత్ర ఫస్ట్ బీట్ టీజర్‌కు మంచి స్పందన వచ్చింది.