Diljit Dosanjh: నేను ఈ ప్రపంచాన్ని ఎప్పుడో వదిలేశా.. మరణంపై సింగర్ దిల్జీత్ షాకింగ్ కామెంట్స్
ఇటీవల జరిగిన కెనడా ఈవెంట్ లో మరణం గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన సింగర్ దిల్జీత్(Diljit Dosanjh).
- V Santhosh Kumar
- Published on- May 4, 2026 / 03:05 PM IST
Singer Diljit Dosanjh Shocking Comments at Canada Aura World Tour Event
- మరణం అంటే భయం లేదన్న దిల్జీత్.
- భౌతిక ప్రపంచం నుండి వైదొలిగానని వెల్లడి.
- ప్రేమ, క్షమతో కూడిన ఆధ్యాత్మిక జీవనం.
Diljit Dosanjh: ప్రముఖ పంజాబీ గాయకుడు, నటుడు దిల్జీత్ దోసాంజ్ గురించి, ఆయన సినిమాల గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఆయన సినిమాలకు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇటీవల ఆయన కెనడాలోని కాల్గరీలో నిర్వహించిన తన ‘ఆరా వరల్డ్ టూర్’ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఈ ఈవెంట్ లో ఆయన మాట్లాడైన మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాను, ఈ భౌతిక ప్రపంచం నుండి తాను ఇప్పటికే వైదొలిగానని సంచలన కామెంట్స్ చేశారు. మరణం అన్నా, ప్రాణాలు పోతాయన్నా భయం తనకు అస్సలు లేదని, ఒక రకమైన వైరాగ్యంతో కూడిన ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నానని ఆయన బహిరంగంగా ప్రకటించారు.
Vijay Thalapathy: విజయ్ విజయం ఊహించలేదు.. తమిళనాడు ఎలక్షన్స్ పై రాజశేఖర్ షాకింగ్ కామెంట్స్
2025 డిసెంబర్ లోనే తాను ఈ శరీరం నుండి బయటకు రావాలని, అంటే ప్రాణత్యాగం చేయాలని ప్రయత్నించానని దిల్జీత్(Diljit Dosanjh) వెల్లడించారు. అయితే, ఈ లోకంలో తాను పూర్తి చేయాల్సిన పనులు ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయని అందుకే ఆగిపోయానని వివరించారు. భయం అనేది మనిషిని వెనక్కి లాగుతుందని, కానీ తాను భయాన్ని జయించానని చెప్పారు. వేదికపై నిలబడి ఉన్నప్పుడు అది తనకు దైవంతో సమానమని, సత్యం వైపే తన ప్రయాణం సాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
ప్రస్తుతం దిల్జీత్ ప్రేమ, క్షమ, విశ్వాసం అనే సూత్రాల మీద ఆధారపడి జీవించాలని కోరుకుంటున్నారు. భౌతిక సుఖాల కంటే ఆత్మ సంతృప్తికే ప్రాధాన్యత ఇస్తున్నానని, మరణం గురించి ఆందోళన చెందడం మానేశానని తెలిపారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఒక గొప్ప కళాకారుడు ఇంతటి లోతైన ఆధ్యాత్మిక చింతనతో మాట్లాడటం అందరినీ ఆలోచింపజేస్తోంది.
