Bigg Boss 10 Telugu : ఫస్ట్ కంటెస్టెంట్ ఫిక్స్! హౌస్‌లోకి అడుగుపెట్టబోయేది ఎవరో తెలుసా?
Singer Jhansi: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో ఫస్ట్ కంటెస్టెంట్ ఎవరో తెలిసిపోయింది.
- Thota Vamshi Kumar
- Updated on- September 5, 2026 / 02:35 PM IST
Singer Jhansi First Contestant Confirmed of Bigg Boss Telugu 10 Agnipariksha
Bigg Boss 10 Telugu Singer Jhansi : బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10కు కౌంట్ డౌన్ మొదలైంది. ఆదివారం (సెప్టెంబర్ 6) సాయంత్రం 7 గంటలకు ఈ సీజన్ గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. సీజన్ 10 కాబట్టి దశావతారం కాన్సెప్ట్‌తో కొత్తగా చూపించనున్నారని అంటున్నారు. ఇక హౌస్‌లోకి ఎవరు అడుగుపెడతారు అనే విషయంలో రోజుకో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే.. ఓ కంటెస్టెంట్ విషయంలో కార్లిటీ వచ్చేసింది.
ఆ కంటెస్టెంట్ ఎవరో కాదు.. జానపద సింగర్ ఝాన్సీ. అగ్నిపరీక్ష సీజన్ 2లో ఆమె తనదైన తీరుతో అందరిని ఆకట్టుకుంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గకుండా, టాస్కుల్లో దూకుడుగా ఆడింది. అగ్ని పరీక్ష సీజన్ 2 గ్రాండ్ ఫినాలేలో టికెట్ టు బిగ్‌బాస్ ప్రకటించారు. ఈ టికెట్ గెలిచిన వారు నేరుగా బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ లభిస్తుంది. ఈ పోటీల్లో ఝాన్సీ విజయం సాధించింది. ఈ క్రమంలో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో అడుగుపెట్టే తొలి కంటెస్టెంట్‌గా నిలిచింది. ఆదివారం గ్రాండ్ లాంఛ్‌లో ఆమె హౌస్‌లో అడుగుపెట్టనుంది.
Read Also – Bigg Boss Telugu 10 : సీజన్ 10లో బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టేది వీళ్లేనా?
ఝాన్సీ ది తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలంలోని కోమటికుంట గ్రామం. సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన ఆమె తన కుటుంబానికి సాయం చేస్తూ పొలం పనుల్లో పాల్గొనేది. పాటలు పాడడం ఆమెకు చాలా ఇష్టం. జానపద పాటలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ‘రామ్‌రెడ్డి దొర’, ‘అడ్డా బాటలకాడ నల్ల సారంగులయ్య’, ‘అందాల రాధ’, ‘కాసరం కట్ట వంటి పాటలు ఆమెకు గుర్తింపు తీసుకువచ్చాయి. సోషల్ మీడియాలో వచ్చిన ఆ గుర్తింపుతో అగ్ని పరీక్షలో పాల్గొంది. విజేతగా నిలిచింది.
