Rahul Sipligunj : ఆస్కార్ వచ్చినంత మాత్రాన డబ్బులు రావు.. రాహుల్ సిప్లిగంజ్ షాకింగ్ కామెంట్స్

Singer Rahul Sipliganj shocking comments on Oscar
Rahul Sipligunj : సింగర్ రాహుల్ సిప్లిగంజ్.. ఈ పేరు తెలియని ఆడియన్స్ ఉండరు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. గల్లీ బాయ్ గా స్టార్ట్ చేసిన తన కెరీర్ పాత బస్తీ బోనాల సాంగ్స్ వరకూ వచ్చి నేడు ఆస్కార్ స్థాయికి చేరింది. ప్రస్తుతం ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపు అందుకుంటున్నాడు. కేవలం సింగర్ గానే కాకుండా ఆ మధ్య కాలంలో బిగ్ బాస్ 3కి వెళ్లి మరింత ఫెమస్ అయ్యాడు.
అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న రాహుల్ ఆస్కార్ వస్తే డబ్బులు ఫ్రీగా రావు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇక ఇందులో యాంకర్ మాట్లాడతూ.. ఆస్కార్ తర్వాత కూడా డబ్బుల గురించి భయపడ్డ సందర్భాలు ఉన్నాయా అని అడిగితే.. ఎందుకు లేవు.. ఇప్పటికీ నేను డబ్బుల కోసం భయపడుతూ ఉంటాను. ఆస్కార్ అనేది ఓ గుర్తింపు మాత్రమే. అది డబ్బులు ఇవ్వదు. అసలు ఆస్కార్ వచ్చింది అన్న విషయాన్ని రెండు మూడు నెలల తర్వాత అందరూ మర్చిపోతారు. ఎవ్వరికీ గుర్తుండదు.
Also Read : Alia Bhatt : నాకు పక్షవాతం వచ్చిందా? ఏంటి తమాషా చేస్తున్నారా.. ఆ రూమర్స్ పై ఆలియా ఫైర్
ఒక్కసారి ఆస్కార్ వస్తే నేను తోపు కాదు. డబ్బులు కావాలి అంటే మళ్ళీ సాంగ్స్ చెయ్యాల్సిందే. మళ్ళీ హిట్ పడాల్సిందే. అంతెందుకు బిగ్ బాస్ కూడా విన్ అయ్యా.. ఆ క్రేజ్ కూడా కొంతకాలమే ఉంది. తర్వాత నుండి ఎవ్వరూ పట్టించుకోలే.. నిజానికి ఒకసారి స్టార్ స్టేటస్ వచ్చాక దాన్ని కాపాడుకోవడం చాలా కష్టం. లేకపోతే డెంజర్ లో పడతాము అంటూ చెప్పాడు. మొత్తానికి ఆస్కార్ వచ్చినా తన జీవితం మారలేదని సింపుల్ గా చెప్పాడు రాహుల్ సిప్లిగంజ్.