Singer Rahul Sipligunj marries Harinya Reddy
Rahul Sipligunj-Harinya Reddy: టాలీవుడ్ ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ వివాహబంధంలోకి అడుగుపెట్టాడు. ఈరోజు(నవంబర్ 27) ఉందయం తన ప్రియురాలు హరిణ్య మెడలో మూడుముళ్లు వేశాడు. హైదరాబాద్‌లో జరిగిన ఈ వివాహానికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను(Rahul Sipligunj-Harinya Reddy) ఆశీర్వదించారు. ప్రస్తుతం ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఈ కొత్త జంటకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’.. ఘట్టమనేని వారసుడి కొత్త సినిమా.. పోస్టర్ అదిరింది..
ఇక రాహుల్ సిప్లిగంజ్ విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ సింగర్ గా కొనసాగుతున్నాడు. ఇప్పటికే ఎన్నో హిట్స్ సాంగ్స్ పడిన రాహుల్.. ఆర్ఆర్ఆర్ సినిమాలో పడిన నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. ఇందుకు గాను తెలంగాణ ప్రభుత్వం రాహుల్ సిప్లిగంజ్ కి కోటి రూపాయల రివార్డ్ ను ప్రకటించింది.
Telangana Jagruthi chief @RaoKavitha blessed the newly wed @Rahulsipligunj couple pic.twitter.com/LJkYUREl5q
— SS Sagar (@SSsagarHyd) November 27, 2025