Singer Revanth : గుంటూరులో సింపుల్‌గా సింగర్ రేవంత్ వివాహం

ఇటీవల డిసెంబర్‌ 24న సింగర్ రేవంత్‌ కి అన్వితతో నిశ్చితార్థం జరిగింది. తాజాగా ఆదివారం సింగర్ రేవంత్ వివాహం జరిగింది. కరోనా పరిస్థితుల దృష్ట్యా కుటుంబసభ్యులు, సన్నిహితులు మధ్య.......

Revanth Wedding

Singer Revanth :   ‘సప్త స్వరాలు’ అనే షోతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు రేవంత్. ఆ తర్వాత సూపర్ సింగర్ లాంటి పలు షోలలో పాల్గొని తన గాత్రంతో అందర్నీ మెప్పించాడు. ఇండియన్ ఐడల్ ని గెలిచి పాపులర్ అయ్యాడు రేవంత్. ఆ తర్వాత రేవంత్ కి చాలా సినిమా పాటలు పాడే అవకాశం వచ్చింది. సింగర్ రేవంత్ ఇప్పటికే దాదాపు 200కి పైగా సాంగ్స్ పాడాడు. ఇటీవల డిసెంబర్‌ 24న సింగర్ రేవంత్‌ కి అన్వితతో నిశ్చితార్థం జరిగింది. తాజాగా ఆదివారం సింగర్ రేవంత్ వివాహం జరిగింది.

Pawan Kalyan : సమతామూర్తి సన్నిధిలో పవన్ కళ్యాణ్

తెలుగు సినీ గాయకుడు, ఇండియన్‌ ఐడిల్‌ విన్నర్ రేవంత్‌ ఓ ఇంటి వాడయ్యారు. గుంటూరుకు చెందిన అన్వితతో ఫిబ్రవరి 6 ఆదివారం రేవంత్ వివాహం జరిగింది. కరోనా పరిస్థితుల దృష్ట్యా కుటుంబసభ్యులు, సన్నిహితులు మధ్య మాత్రమే సింపుల్ గా గుంటూరులోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో జరిగింది. ఈ వేడుకకు పలువురు గాయనీగాయకులు కూడా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. తాజాగా సింగర్ రేవంత్ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.