ప్రముఖ గాయకులు ఏసుదాసు సోదరుడు అనుమానాస్పద మృతి

గాయకుడు ఏసుదాసు సోదరుడు అనుమానాస్పద మృతి - కొచ్చిలోని బ్యాక్‌ వాటర్స్‌ వద్ద మృతదేహాం లభ్యం..

  • Publish Date - February 6, 2020 / 12:50 PM IST

గాయకుడు ఏసుదాసు సోదరుడు అనుమానాస్పద మృతి – కొచ్చిలోని బ్యాక్‌ వాటర్స్‌ వద్ద మృతదేహాం లభ్యం..

ప్రముఖ గాయకులు కేజే ఏసుదాసు(జేసుదాసు) సోదరుడు కేజే జస్టిన్‌ అనుమానాస్పద స్థితిలో బుధవారం మృతి చెందారు. ఆయన వయసు 62 సంవత్సరాలు. కేరళ రాష్ట్రం కొచ్చిలోని బ్యాక్‌ వాటర్స్‌ వద్ద జస్టిన్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మధ్యాహ్నం 2.30 గంటలకు కొచ్చిన్‌ వల్లర్పాడమ్‌ కంటైనర్‌ టెర్మినల్‌ సమీపంలో జస్టిన్‌ శవం తేలుతూ కనిపించింది.

అగస్టీన్ జోసెఫ్, ఎలిజిబెత్ జోసెఫ్ దంపతులకు అయిదుగురు సంతానం. అందులో జేసుదాసు మొదటివాడు. ఆయన సొంత సోదరుడే కేజే జస్టిన్‌. ఈయన  సంగీత కారుడు, నాటక రచయిత కూడా. బుధవారం ఉదయం చర్చికి వెళ్లిన జస్టిన్‌ రాత్రి వరకు ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు అతన్ని వెతకగా ఎంతకీ కనిపించకపోవడంతో పోలీసులను సంప్రదించారు. బుధవారం త్రికక్కర పోలీసులు బ్యాక్‌ వాటర్స్‌ నుంచి జస్టిస్‌ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. 

జస్టిన్ మంగళవారం నాడే అదృశ్యమయ్యారని కూడా వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా, బుధవారం సాయంత్రానికి మృతదేహాన్ని కనుగొన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎర్నాకులం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ​కాగా కొడుకు మరణంతో జస్టిన్‌ కొంతకాలం నుంచి మనో వేదనకు గురవుతునట్లు, అంతేకాకుండా ఆయనకున్న ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.