Mytri Movie Makers: నితిన్, శ్రీను వైట్ల కాంబోలో మైత్రి కొత్త మూవీ.. అసలు ఏంటి సార్ మీ ధైర్యం!
ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న టాప్ ప్రొడక్షన్ కంపెనీలలో మైత్రీ మూవీ మేకర్స్(Mytri Movie Makers) ఒకటి. వరుసగా స్టార్స్ తో సినిమాలు చేయడం, భారీ విజయాలు అందుకోవడం ఈ సంస్థకు అలవాటుగా మారిపోయింది.

Mythri Movie Makers to make a film in Nithin Srinu Vaitla combo
Mytri Movie Makers: ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న టాప్ ప్రొడక్షన్ కంపెనీలలో మైత్రీ మూవీ మేకర్స్ ఒకటి. వరుసగా స్టార్స్ తో సినిమాలు చేయడం, భారీ విజయాలు అందుకోవడం ఈ సంస్థకు అలవాటుగా మారిపోయింది. ఇక ఇటీవల విడుదలైన పుష్ప 2 ఏ రేంజ్ విజయాన్నీ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా ఏకంగా ఇండియన్ సినీ ఇండస్ర్టీలోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఆ తరువాత కూడా వరుసగా టాప్ స్టార్స్ తో సినిమాలు చేస్తూ వస్తోంది ఈ సంస్థ.
అయితే కేవలం పెద్ద సినిమాలు మాత్రమే కాదు చిన్న సినిమాల విషయంలో కూడా తగ్గే ప్రసక్తే లేదు అనేలా సినిమాలు చేస్తోంది. అయితే, ఈ క్రమంలోనే తాజాగా ఈ సంస్థ నుండి రాబోతున్న ఒక సినిమా గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఆ కాంబో మరేదో కాదు నితిన్, శ్రీను వైట్ల. ఈ కాంబోలో ఒక మూవీ ప్లాన్ చేస్తుందట మైత్రీ మూవీ మేకర్స్(Mytri Movie Makers) సంస్థ. ఈ ప్రాజెక్టుపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుందని టాక్. అయితే, ఈ న్యూస్ తెలిసిన నెటిజన్స్ ఈ కాంబోను ఎలా సెట్ చేశారంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ ఇటీవల నితిన్ తో రాబిన్ హుడ్ సినిమా చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. అలాగే, నితిన్ కి కూడా గత కొంతకాలంగా సరైన హిట్స్ లేవు. ఇక శ్రీను వైట్ల కూడా చాలా కాలంలో ఫ్లాప్స్ తో సతమతమవుతున్నారు. ఇటీవల వచ్చిన విశ్వం సినిమా కూడా ఆడింది అంటే ఆడింది అనే రేంజ్ రిజల్ట్ ను దక్కించుకుంది. మరి, అలాంటి ప్లాప్ స్టార్స్ తో సినిమా ఎలా ప్లాన్ చేస్తున్నారు? అసలు ఏంటి మీ ధైర్యం అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే, సినిమా ఇండస్ట్రీలో హిట్స్, ప్లాప్స్ అనేవి సహజమే. కాబట్టి, వాటికి అతీతంగా ముందుకు సాగితేనే లైఫ్ ఉంటుంది అనే ఫార్మటు లో వెళ్తున్నారు మైత్రి మూవీ మేకర్స్ అని మరొకొందరు అంటున్నారు. ఏది ఏమైనా ఈ ప్రాజెక్టు తో నితిన్, శ్రీను వైట్లకు మంచి హిట్ పడాలని కోరుకుంటున్నారు.