Malavika Mohanan: ఆ క్షణాలు చాలా మధురం.. ప్రభాస్ హీరోయిన్ క్రేజీ కామెంట్స్.. ఫ్లోలో రాజాసాబ్ అప్డేట్ కూడా ఇచ్చేసిందిగా!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఫుల్ స్పీడ్ లో ఉన్నాడు(Malavika Mohanan). ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు నాలుగు సినిమాలను ఒకేసారి లైన్లో పెట్టి వరుసగా షూటింగ్స్ చేస్తున్నాడు.

Malavika Mohanan: ఆ క్షణాలు చాలా మధురం.. ప్రభాస్ హీరోయిన్ క్రేజీ కామెంట్స్.. ఫ్లోలో రాజాసాబ్ అప్డేట్ కూడా ఇచ్చేసిందిగా!

Raja Saab beauty Malavika made crazy comments on Prabhas

Updated On : September 12, 2025 / 12:11 PM IST

Malavika Mohanan: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఫుల్ స్పీడ్ లో ఉన్నాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు నాలుగు సినిమాలను ఒకేసారి లైన్లో పెట్టి వరుసగా షూటింగ్స్ చేస్తున్నాడు. అందులో రాజా సాబ్ ఒకటి. నిజానికి ఈ సినిమా ప్రభాస్ కెరీర్ లో చాలా ప్రత్యేకం. ఎందుకంటే ప్రభాస్ తన కెరీర్ లో ఫస్ట్ టైం హారర్ అండ్ కామెడీ బ్యాక్డ్రాప్ లో సినిమా చేస్తున్నాడు. అందుకే ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని డిసెంబర్ 5న విడుదలకు సిద్ధం అవుతుంది ఈ సినిమా.

Lavanya Tripathi: తల్లైన తరువాత విడుదలైన మొదటి సినిమా.. తనల్ మూవీపై లావణ్య రియాక్షన్

ఇదిలా ఉంటే రాజా సాబ్ సినిమా గురించి, ప్రభాస్ గురించి ఇంటరెస్టింగ్ విషయాలు చెప్పుకొచింది మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్(Malavika Mohanan). ఈ సినిమాలో ఆమె ప్రభాస్ సరసన నటిస్తోంది. ఆ అవకాశం రావడం చాలా ఆనందంగా భావిస్తోందట. ఇంకా ఆమె మాట్లాడుతూ.. ప్రభాస్ చాలా అద్భుతమైన వ్యక్తి. వయసులో ఆయన నాకంటే పెద్దవాడు. కానీ, ఆయన్ని చూసినప్పుడు అలా అనిపించదు. సైలెంట్ గా ఉంటారు. ఈ సినిమా కోసం ఆయనతో కలిసి పనిచేయడం మధురంగా అనిపించింది. అలాగే, రాజాసాబ్ సినిమాలో మా ప్రయాణం అందంగా ఉంటుంది. సినిమా కూడా పూర్తయ్యింది. కొన్ని పాటలను చిత్రీకరించాల్సి ఉంది. అంటూ చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. ప్రస్తుతం మాళవిక చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక రాజా సాబ్ సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాను దర్శకుడు మారుతీ తెరకెక్కిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మాళవిక పాటు నిధి అగర్వాల్, రద్దీ కుమార్ కూడా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ ప్రభాస్ బర్త్ డే సందర్భంగా రానుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ, మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.