Karishma Sharma: ఫ్రెండ్స్ రాలేదని ట్రైన్ నుంచి దూకేసిన నటి.. తీవ్ర గాయాలు.. ఆసుపత్రిలో చేరిక

కదులుతున్న రైలు నుంచి కంగారులో కిందకు దూకి గాయపడ్డారు బాలీవుడ్ నటి కరిష్మా శర్మ(Karishma Sharma). ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన ఆమె ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Karishma Sharma: ఫ్రెండ్స్ రాలేదని ట్రైన్ నుంచి దూకేసిన నటి.. తీవ్ర గాయాలు.. ఆసుపత్రిలో చేరిక

Bollywood actress Karisma Sharma accidentally jumps from a train

Updated On : September 12, 2025 / 11:09 AM IST

Karishma Sharma: కదులుతున్న రైలు నుంచి కంగారులో కిందకు దూకి గాయపడ్డారు బాలీవుడ్ నటి కరిష్మా శర్మ. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన ఆమె ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈమేరకు ఆమె తన సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీంతో ఈ విషయం వైరల్‌గా మారింది. ఇక ఈ పోస్ట్ లో ప్రమాదానికి గల కారణాలను కూడా వివరించారు నటి కరిష్మా శర్మ(Karishma Sharma). “ఓ సినిమా షూటింగ్ ప్లేస్ కి వెళ్లడానికి చీర ధరించి బయల్దేరాను. ముంబయి లోకల్‌ ట్రైన్ ఎక్కగానే అది వేగంగా ముందుకు కదిలింది. ఆ సమయంలో నా స్నేహితులు ఇంకా ట్రైన్ ఎక్కలేదు. వాళ్లు రైలు ఎక్కలేదనే టెన్షన్‌, భయంతో నేను ట్రైన్ నుంచి కిందికి దూకేశాను.

Mytri Movie Makers: నితిన్, శ్రీను వైట్ల కాంబోలో మైత్రి కొత్త మూవీ.. అసలు ఏంటి సార్ మీ ధైర్యం!

ఒక్కసారిగా వెనక్కి తిరిగిపడడంతో వీపు, తలకు బలంగా దెబ్బలు తగిలాయి” అని రాసుకొచ్చింది. శరీరమంతా చిన్న చిన్న గాయాలైనట్లు తెలిపింది. తలకు గాయం కావడంతో ఎంఆర్‌ఐ చేశారని, ఒకరోజు అబ్సర్వేషన్ లో ఉండాలని డాక్టర్లు సూచించినట్లు తెలిపింది. దానికి సంబందించిన ఫోటోలను కూడా ఆమె షేర్ చేసింది. ఇక కరిష్మా శర్మ ‘రాగిని ఎంఎంఎస్‌: రిటర్న్స్‌’, ‘ప్యార్‌ కా పంచనామా 2’ వంటి సినిమాలతో బాలీవుడ్ లో ఫేమ్ సంపాదించిన విషయం తెలిసిందే.