Big Boss 5: లంచ్‌కి సిరి.. డిన్నర్‌కి హమీదా.. శ్రీరామ్ రొమాంటిక్ స్టోరీ!
బిగ్ బాస్ ఐదవ సీజన్ నాలుగో వారం కూడా చివరికి వచ్చేసింది. ఇప్పటికే ముగ్గురు కంటెస్టెంట్లు హౌస్ నుండి ఎలిమినేట్ అయిపోగా.. ఈ వారం ఉచ్చు ఎవరికి బిగుస్తుందోనని టెన్షన్ లో ఉన్నారు.
- Naresh Mannam
- Published On : October 1, 2021 / 08:53 PM IST
Big Boss 5
Big Boss 5: బిగ్ బాస్ ఐదవ సీజన్ నాలుగో వారం కూడా చివరికి వచ్చేసింది. ఇప్పటికే ముగ్గురు కంటెస్టెంట్లు హౌస్ నుండి ఎలిమినేట్ అయిపోగా.. ఈ వారం ఉచ్చు ఎవరికి బిగుస్తుందోనని టెన్షన్ లో ఉన్నారు. ఈ టెన్షన్ నుండి కాస్త ఉపశమనం కల్పించేందుకు బిగ్ బాస్ ఇంట్లో రొమాంటిక్ వాతావరణం తీసుకొచ్చాడు. సహజంగానే ఇంట్లో టాస్కులు, గేమ్స్ మాత్రమే కాదు లవ్ ట్రాకులు కూడా సృష్టించేస్తాడు బిగ్ బాస్.
Poonam Kaur: ప్రకాష్ రాజ్ గెలిస్తే నా సమస్యలు బయటపెడతా.. పూనమ్ ట్వీట్!
అయితే.. ఈ సీజన్ లో కపుల్స్ వ్యవహారం కాస్త వెనకబడిన ఉన్న ఒకరిద్దరితో బిగ్ బాస్ ఆ లోటు తీర్చేస్తున్నాడు. అలా శ్రీరామ్- హమీదాల జంట ఎంత క్యూట్ గా ఉంటుందో వారిద్దరి మధ్య ఎపిసోడ్ కూడా అంతే క్యూట్ గా ఉంటుంది. కాగా, వీళ్లిద్దరూ ఏకాంతంగా మాట్లాడుకోవడమే కాక హమీదాకు మసాజ్‌లు కూడా చేశాడు శ్రీరామ్. అయితే, తమ మధ్య ఉన్న రిలేషన్ ఏంటని అడిగితే మాత్రం దానికి ఏ పేరు పెట్టాలో అర్థం కాక సతమతమయ్యారిద్దరూ.
Maa Elections: ప్రకాష్ VS విష్ణు.. మధ్యలో పవన్.. కాకరేపుతున్న ఎలక్షన్!
ఇక, ఈసారి శ్రీరామ్ ఒకేసారి సిరి, హమీదాలని టార్గెట్ చేసి తనలోని రొమాంటిక్ యాంగిల్ బయటపెట్టేశాడు. శుక్రవారం ఎపిసోడ్ ప్రోమో విడుదల కావడంతో అందులోశ్రీరామ్ కామెంట్స్ ఇంట్రస్టింగ్ మారాయి. మీ మనసులో ఎవరైనా ఉన్నారా అని.. ప్రియ శ్రీరామ్ ను ప్రశ్నించగా.. సిరి కమిటెడ్ కాకపోయుంటే తప్పకుండా ఆమెకు ట్రై చేసేవాడినని.. ఆ విషయం ఆమెకు కూడా చెప్పానని మనసులోని మాటను బయటపెట్టాడు.
Telugu Movie Releases: ఒకేసారి 6 సినిమాలు.. మూవీ లవర్స్‌కి పండగే!
ఇక ఒక అమ్మాయిని డేట్‌కు తీసుకెళ్లాలంటే ఎవరిని తీసుకెళ్తావని మరో ప్రశ్న వేయగా.. శ్రీరామ్ హమీదాను సూటిగా చూడటంతో ఆమె సిగ్గు మొగ్గలేసింది. తర్వాత వీళ్లిద్దరూ కలిసి రొమాంటిక్ డాన్స్ లో మునిగిపోయారు. ఇక సిరి, హమీదాలో ఎవరు కావాలని కాజల్ అడిగిన ప్రశ్నకు లంచ్ టైంలో సిరి.. డిన్నర్ లో హమీదా కావాలని శ్రీరామ్ చెప్పిన ఆన్సర్ కి హౌస్ నుండి హా అంటూ నిట్టూర్పులు వచ్చేశాయి. మరి ఫుల్ ఎపిసోడ్ ఎలా ఉంటుందో చూడాలి!
