Sitara : సితార పాప జ్యువెల్లరీ యాడ్ కోసం తీసుకున్న రెమ్యునరేషన్‌తో ఏం చేసిందో తెలుసా..?
సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) కూతురు సితార (Sitara)ను పరిచయం చేయాల్సిన పని లేదు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ యూట్యూబ్‌లో వీడియోలో అప్‌లోడ్ చేస్తూ మంచి గుర్తింపును సంపాదించుకుంది.
- Thota Vamshi Kumar
- Updated on- July 15, 2023 / 07:35 PM IST
Sitara Ghattamaneni
Sitara Ad remuneration : సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) కూతురు సితార (Sitara)ను పరిచయం చేయాల్సిన పని లేదు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ యూట్యూబ్‌లో వీడియోలో అప్‌లోడ్ చేస్తూ మంచి గుర్తింపును సంపాదించుకుంది. తను చేసే డ్యాన్స్‌కు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అంటే అతిశయోక్తి కాదేమో. ఇటీవల ఓ ప్రముఖ జ్యువలరీ యాడ్‌లో నటించగా అందుకు సంబంధించిన ఫోటోలు ప్రసిద్ద టైమ్స్ స్క్వేర్ (New York Time Square)బిల్‌బోర్డ్‌పై ప్రదర్శితమయ్యాయి.
ఇక ఈ యాడ్‌లో నటించినందుకు సితార కోటి రూపాయల పారితోషికం తీసుకున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే.. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కాగా.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సితార మాట్లాడుతూ తన పారితోషికంపై స్పందించింది. తాను ఎంత తీసుకున్నాను అనే విషయాన్ని అయితే చెప్పలేదు గానీ తనకు ఇచ్చిన రెమ్యునరేషన్‌ను మొత్తాన్ని ఛారిటీకి ఇచ్చినట్లు చెప్పింది.
ఇక..జ్యువెలరీ సంస్థ యాడ్‌లో చేయడం సంతోషంగా ఉందని తెలిపింది. యాడ్ షూట్ మొత్తం చాలా సరదాగా సాగిందని, ప్రతి ఒక్కరు తనకు సపోర్టు చేసినట్లు చెప్పింది. తన యాడ్‌కు సంబంధించిన ఫోటోలను న్యూయార్క్‌లోని టైమ్ స్క్వేర్‌లో కనిపించిన రోజు ఆనందంతో కన్నీళ్లు వచ్చేశాయంది. డాడీని హత్తుకుని భావోద్వేగానికి గురైనట్లు తెలిపింది. ఇక తనకు సినిమాల్లోకి రావాలనే ఆసక్తి ఉన్నట్లు చెప్పుకొచ్చింది.
సితార తనకు ఇచ్చిన రెమ్యునరేషన్‌ను సేవా కార్యక్రమాలను ఇచ్చాను అని చెప్పడం నెట్టింట వైరల్‌గా మారింది. సూపర్ స్టార్ మహేశ్ బాబు ఎంతో మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయిస్తూ ఆదర్శంగా నిలుస్తుంటే సితార కూడా తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తుందోంటూ ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
