Siva Karthikeyan Fans booked Prince movie tickets differently
Prince : తమ హీరోల కోసం అభిమానులు ఏ రేంజ్ లో అభిమానం చూపిస్తారో అందరికి తెలిసిందే. తమ ఫేవరేట్ హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే అభిమానులకి పండగే. థియేటర్స్ దగ్గర రచ్చ రచ్చ చేస్తారు అభిమానులు. బ్యానర్లు, కటౌట్లు, పాలాభిషేకాలు, పూల దండలతో తమ అభిమానాన్ని చాటుకుంటారు ఫ్యాన్స్. తాజాగా శివ కార్తికేయన్ సినిమా ప్రిన్స్ కి తమిళ్ అభిమానులు తమ అభిమానాన్ని సరికొత్తగా చాటుకున్నారు.
తమిళ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ హీరోగా, యుక్రెయిన్ నటి మరియా హీరోయిన్ గా జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ప్రిన్స్. దీపావళి కానుకగా ఈ సినిమా అక్టోబర్ 21న విడుదల కానుంది. ప్రిన్స్ సినిమా తెలుగు, తమిళ్ లో రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఆన్లైన్ లో బుకింగ్స్ కూడా ఓపెన్ చేశారు.
Prince Movie Pre Release Event : ప్రిన్స్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ..
తాజాగా కొంతమంది అభిమానులు తమిళనాడులోని ఓ థియేటర్ లో శివ కార్తికేయన్ సినిమా ప్రిన్స్ కి ఆన్లైన్ లో టికెట్స్ బుక్ చేసేటప్పుడు సీట్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత SK వచ్చేలాగా బుక్ చేశారు. టికెట్ బుకింగ్స్ లో SK వచ్చేలా బుక్ చేయడంతో ఈ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. శివ కార్తికేయన్ అభిమానులు సినిమా రోజు ఇలా SK ఆకారంలో కూర్చొని హంగామా చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ ఫోటో చూసిన వాళ్లంతా సినిమా టికెట్స్ ఇలా కూడా బుక్ చేసుకుంటారా అని ఆశ్చర్యపోతున్నారు.
. Our @Siva_Kartikeyan anna Fans Start ????#Sk Alaparaigal ????#Prince #Sivakarthikeyan #PrinceDiwali pic.twitter.com/3Ze90GQBYb
— • Chichilubu Sk❼??? (@guruawesome) October 17, 2022