Sivaji Raja
Sivaji Raja : సీనియర్ నటుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ శివాజీ రాజా కూడా చిరంజీవి అభిమానే. తాజాగా శివాజీ రాజా 10 టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.(Sivaji Raja)
ఒకప్పుడు ఇండస్ట్రీలో ఏదైనా సమస్య వస్తే అందరూ దాసరి నారాయణ దగ్గరికి వెళ్ళేవాళ్ళు. ఇండస్ట్రీ పెద్దగా దాసరి నారాయణ పలు సమస్యలను పరిష్కరించారు. దాసరి మరణం తర్వాత ఆ ప్లేస్ ఎవరూ తీసుకోలేదు. కరోనా సమయంలో, ఆ తర్వాత చిరంజీవి ముందుకు వచ్చి సమస్యలు తీరుద్దామనుకున్నా పలువురు విమర్శలు చేసారు. దాంతో చిరంజీవి తనకు ఇండస్ట్రీ పెద్ద వద్దు, సపోర్ట్ ఏమైనా కావాలంటే చేస్తా అంతే అని ఓ ఈవెంట్ లో కూడా మాట్లాడారు.
Also Read : Andhra King Taluka : ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ థ్యాంక్యూ మీట్.. ఫొటోలు..
తాజాగా శివాజీ రాజా చిరంజీవి గురించి మాట్లాడుతూ.. దాసరి గారి తర్వాత అంత ఓపిక, అంత మంచితనం, సర్ది చెప్పే గుణం, నేను ఎక్కడ నుంచి వచ్చాను అనే విషయం తెలిసిన వ్యక్తి, పది మందికి సాయం చేద్దాం అనుకునే వ్యక్తి చిరంజీవి గారే. ఆయనకు ఇంకొకరు ప్రత్యామ్నాయం లేరు. కానీ చిరంజీవి పేరు కూడా రికమండ్ చేయడానికి లేకుండా చేస్తునారు కొంతమంది. కష్టపడి పనిచేసే వాళ్ళ మీదకు రాళ్లు వేస్తారు, బురద వేస్తారు. వీళ్ళు చేయరు, చేసే వాళ్ళని చేయనివ్వరు. అందుకే చిరంజీవి గారు కూడా పక్కకు తప్పుకున్నారు. బహుశా ఈ వయసులో ఎందుకు ఇవన్ని అనుకున్నారేమో. కానీ దాసరి గారి తర్వాతే చిరంజీవి గారే. ఇంకొకరు లేరు అని అన్నారు.
అలాగే చిరంజీవి ఎంత కష్టపడతాడో చెప్తూ ఓ సంఘటన గురించి చెప్పారు. శివాజీ రాజా మాట్లాడుతూ.. ఆయన ఒక అద్భుతం. మద్రాస్ లో మా ఇంటి వెనకాలే ఉండేవారు. 101 జ్వరంతో వాన వాన వెల్లువాయే సాంగ్ షూటింగ్ చేసారు. వర్షం సాంగ్ జ్వరంలో చేసారు. షూటింగ్ చేసి ఇంటికి వచ్చారు. నేను అప్పుడు చిరంజీవి ఇంటికి నాగబాబుతో కలిసి వెళ్తే వాళ్ళ నాన్న అలిగారు చిరంజీవి జ్వరంతో చేసాడని. అక్కడ పరిస్థితి సీరియస్ గా ఉంది అని ఇంట్లోంచి వచ్చేసాను. ఆయన అంత డెడికేటెడ్ గా పనిచేసే వాళ్ళు అని తెలిపారు.
Also Read : Akhanda 2 tickets : ‘అఖండ-2’ టికెట్ ధరలు పెంపు.. ముందు రోజు ప్రీమియర్