Theaters Seized : విజయనగరం జిల్లాలో 6 సినిమా థియేటర్లు సీజ్
భోగాపురంలోని గోపాలకృష్ణ థియేటర్‌ను తనిఖీ చేసి.. సినిమా టిక్కెట్లను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ థియేటర్‌ను కూడా సీజ్ చేయాలని జేసీ ఆదేశించారు.
- bheemraj
- Published On : December 22, 2021 / 11:36 AM IST
Seized
Six Cinema Theaters Seized in Vizianagaram : నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయంటూ.. విజయనగరం జిల్లాలో ఆరు సినిమా థియేటర్లను అధికారులు సీజ్ చేశారు. నిబంధనలను పాటించడం లేదంటూ.. సినిమా థియేటర్లపై జాయింట్ కలెక్టర్ డాక్టర్ కిశోర్ కుమార్ కొరడా ఝుళిపించారు. ఆరు సినిమా హాళ్లను మూసివేయాలని తాహశీల్దార్‌ను ఆదేశించారు.
పూసపాటిరేగ, భోగాపురం, నెల్లిమర్ల మండలాల్లో ఆకస్మికంగా పర్యటించి.. సినిమా థియేటర్లను అధికారులు తనిఖీ చేశారు. పూసపాటిరేగ సాయికృష్ణా థియేటర్‌ను ఆఫీసర్లు పరిశీలించారు. ఈ థియేటర్‌లో ఫైర్ సేఫ్టీ లైసెన్స్ 2015 నుంచి రెన్యువల్ చేయకపోవడాన్ని గుర్తించి.. తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. థియేటర్‌ను సీజ్ చేయాలని తాహశీల్దార్‌ను జేసీ ఆదేశించారు.
Omicron : ఒమిక్రాన్ రోగికి వైద్యం చేసిన డాక్టర్‌కు కొత్త వేరియంట్..!
భోగాపురంలోని గోపాలకృష్ణ థియేటర్‌ను తనిఖీ చేసి.. సినిమా టిక్కెట్లను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ థియేటర్‌ను కూడా సీజ్ చేయాలని జేసీ ఆదేశించారు. నెల్లిమర్లలోని ఎస్ త్రి సినిమాస్ థియేటర్‌లో కూడా.. టిక్కెట్లు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు తేలడంతో.. హాలును అధికారులు సీజ్ చేశారు. విజయనగరం జిల్లాలోనే మొత్తం ఆరు థియేటర్లకు మూత వేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.
