Ram Charan Shankar Movie: చరణ్ సినిమాలో మరో స్టార్ యాక్టర్.. ఎవరంటే?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తుండటంతో ఈ మూవీపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాలో మరో వర్సటైల్ యాక్టర్ నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది. తమిళ, తెలుగు భాషల్లో డైరెక్టర్ కమ్ యాక్టర్‌గా తన సత్తా చాటిన ఎస్.జె.సూర్య ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.
- Anil Aaleti
- Published on- September 9, 2022 / 04:49 PM IST
SJ Surya Joins Ram Charan Shankar Movie
Ram Charan Shankar Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తుండటంతో ఈ మూవీపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కాగా, ఈ సినిమాలో చరణ్‌తో పాటు భారీ తారాగణం నటిస్తున్నట్లు ఈ సినిమా లాంఛ్ సమయంలోనే చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. శ్రీకాంత్, అంజలి, సునీల్, జయరాం, నవీన్ చంద్ర వంటి స్టార్స్ ఈ సినిమాలో నటిస్తుండగా, తాజాగా మరో వర్సటైల్ యాక్టర్ ఈ సినిమాలో నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. తమిళ, తెలుగు భాషల్లో డైరెక్టర్ కమ్ యాక్టర్‌గా తన సత్తా చాటిన ఎస్.జె.సూర్య ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.
Shankar-Ram Charan Movie: ఓ పవర్ ఫుల్ పాత్ర కోసం శంకర్ స్టార్స్ వేట!
ఇటీవల తమిళ హీరో శివకార్తికేయన్ నటించిన ‘డాన్’ మూవీలో తనదైన పర్ఫార్మెన్స్తో ఎస్.జె.సూర్య అదరగొట్టాడు. గతంలో తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘స్పైడర్’ మూవీలో విలన్ పాత్రలో నటించి, మెప్పించిన ఈ యాక్టర్.. ఇప్పుడు చరణ్-శంకర్ కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో నటిస్తుండటంతో ఈ సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి. ఇక ఈ సినిమాలో అందాల భామ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోండగా, థమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు.
