Snakes in the shooting of Ka movie Kiran Abbavaram interesting comments
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ‘క’. నయన్ సారిక హీరోయిన్ గా నటించిన ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. కిరణ్ నటించిన మొదటి పాన్ ఇండియా సినిమా ఇది. సుజీత్, సందీప్ తెరెక్కించిన ఈ సినిమా మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ అందుకుంది.
Also Read : Pushpa 2 : పుష్ప 2 దెబ్బకు బాలివుడ్ సినిమా వాయిదా..
అలా ఈ సినిమా సక్సెస్ తర్వాత వరుస ఇంటర్వూస్ ఇస్తున్నాడు కిరణ్. అందులో భాగంగానే ఇటీవల కిరణ్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో క సినిమా షూటింగ్ లో ఆయన ఎదురుకున్న పలు సంఘటనల గురించి తెలిపాడు. కిరణ్ మాట్లాడుతూ.. ఈ సినిమా షూటింగ్ కోసం అగుంబే అని ఓ ఊరికి వెళ్ళాం.. అది పాములకు ఫెమస్ ఊరు. అలా ఆ సినిమా షూటింగ్ లో అలిసిపోయి నేను 15నిముషాలు పడుకుందామని ఓ చెట్టు కింద మట్టిలో పడుకున్నాను. లేచిన తర్వాత మా టీమ్ వాళ్ళు చెప్పారు.. నువ్వు పడుకున్నప్పుడు నీ పక్క నుండి పాము వెళ్లిందని. ముందే నాకు పాములంటే చాలా భయం. అప్పటి నుండి షూటింగ్ సమయంలో ఎక్కడికి వెళ్లినా చాలా జాగ్రత్తగా లైట్ వేసుకొని మరీ వెళ్ళేవాడిని అని తెలిపారు.
అంతే కాకుండా..ఆ గ్రామంలో షూటింగ్ చేసేటప్పుడు అక్కడున్న ప్రజలు చెప్పేవారు.. పాములు వాళ్ళ ఇంట్లోకి వస్తాయని, అంతేకాక వాళ్ళ ఇంట్లోనే ఉంటాయని, అక్కడికి నిజమైన పులులు ,సింహాలు వస్తుంటాయని కిరణ్ తెలిపారు. అసలు అలాంటి ప్రదేశాల్లో షూటింగ్ చేయడానికి చాలా భయపడ్డాం అని తెలిపాడు.