Pushpa 2 : పుష్ప 2 దెబ్బకు బాలివుడ్ సినిమా వాయిదా..

Bollywood chhava movie Postponed because of Pushpa 2
Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ సినిమా పుష్ప 2. స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. భారీ అంచనాల నడుమ డిసెంబర్ 5న విడుదల కానుంది . పాన్ ఇండియా లెవెల్ లో వస్తున్న ఈ సినిమాకి సంబందించిన ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసారు మేకర్స్.
అయితే ఈ సినిమా కి భయపడి ఇప్పటికే చాలా సినిమాలు తమ రిలీజ్ డేట్ ను వాయిదా వేసుకున్నాయి. ఇక ఆ సినిమాల్లో తాజాగా పుష్ప 2 ప్రభంజనం చూసి చావా సినిమా విడుదల తేదీ మార్చినట్టు తెలుస్తుంది. దర్శక నిర్మాతలు వాయిదా వేసుకునే ఆలోచనలో ఉన్నారట. చావా కూడా వందల కోట్ల బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ కాబట్టి ఈ నిర్ణయం తీసుకుంటున్నారట.
Also Read : Rohit Shetty : అత్యధిక 100 కోట్ల క్లబ్ సినిమాల్లో ఉన్న డైరెక్టర్ ఎవరో తెలుసా..
చావాని పుష్ప రేసు నుంచి తప్పించడం మంచిదని అనుకుంటున్నారట. విక్కీ కౌశల్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చిన చావా సినిమాను సోలోగా రిలీజ్ చేసుకుంటేనే బాగుంటుందనే ఉద్దేశంతో ప్రొడ్యూసర్లు ఈ నిర్ణయం తీసుకుంటున్నారట. ఇకపోతే విక్కీ కౌశల్ హీరోగా నటించిన ఈ సినిమాలో కూడా రష్మిక మందన్న హీరోయిన్ కావడం విశేషం.