Sneha Ullal : ఇటీవల చాలా మంది సీనియర్ హీరోయిన్స్, సీనియర్ ఆర్టిస్టులు మళ్ళీ రీఎంట్రీ ఇస్తున్నారు. గతంలో బిజీగా ఉండి తర్వాత వకాశాలు లేక సినిమాలకి దూరం అయిన చాలా మంది నటినటులు ఇప్పుడు మళ్ళీ రీఎంట్రీ ఇస్తున్నారు. బుల్లితెరపై టీవీ షోస్ లో, సీరియల్స్ లో, వెబ్ సిరీస్ లలో, ఓటిటిలో, సినిమాలలో ఇలా ఏ మీడియంలో ఛాన్స్ వచ్చినా రీఎంట్రీ ఇచ్చి అలరిస్తున్నారు. అటు డబ్బు, ఇటు పేరు సంపాదిస్తున్నారు మళ్ళీ.
సినిమాలకి దూరం అయిన మరో హీరోయిన్ తాజాగా తెలుగులో రీఎంట్రీ ఇస్తుంది. తెలుగులో ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’, ‘కరెంట్’, ‘సింహా’ లాంటి సినిమాల్లో నటించిన పిల్లి కళ్ళ పాప స్నేహ ఉల్లాల్ 2014లో ‘అంతా నీ మాయలోనే’ అనే ఒక చిన్న సినిమా చేసింది దాని తర్వాత తెలుగులో మళ్ళీ కనిపించలేదు. తెలుగు, హిందీ, కన్నడలో చాలానే సినిమాలు చేసింది. 2015లో ‘బేజుబాన్ ఇష్క్’ అనే హిందీ సినిమాలో నటించింది. ఇక అప్పట్నుంచి సినిమాలకి దూరం అయింది. ఇటీవల 2020లో ‘ఎక్సపైరీ డేట్’ అనే హిందీ సిరీస్ తో బాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇచ్చింది.
Samantha : ఆ విషయంలో సమంత నంబర్ 1.. విడాకులతో కలిసొచ్చిందా??
సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ తెలుగులో ఇప్పుడు రీఎంట్రీ ఇస్తుంది. ఈ పిల్లి కళ్ళ పాపని జూనియర్ ఐశ్వర్యారాయ్ అని కూడా పిలిచేవారు. స్నేహాఉల్లాల్ ప్రస్తుతం ‘ఎయిట్(eight) ‘ అనే సినిమాతో టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇస్తోంది. కమెడియన్ సప్తగిరి మెయిన్ లీడ్ లో నటిస్తున్న ఈ చిత్రంలో స్నేహా ఉల్లాల్ కీలక పాత్రలో కనిపించనుంది. నిన్న ఈ సినిమా నుంచి స్నేహాఉల్లాల్ ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. బ్లాక్ డ్రెస్ లో సీరియస్ లుక్ లో స్నేహాఉల్లాల్ అదరగొట్టింది. ఈ సినిమాతో తెలుగులో మంచి కంబ్యాక్ ఇవ్వాలనే ప్లాన్ లో ఉంది స్నేహ.