Sobhita Dhulipala : శోభితకు కాబోయే వరుడు ఇలా ఉండాలంట.. మరోసారి నాగచైతన్యతో రూమర్స్‌పై స్పందించిన శోభిత..

ది నైట్ మేనేజర్ సీజన్ 2 సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలలో మరోసారి తనపై వచ్చిన రూమర్స్ గురించి స్పందించింది. అలాగే తనకి కాబోయే వరుడు ఎలా ఉండాలో చెప్పింది శోభిత.

Sobhita Dhulipala spoke about rumors again in The Night Manager Series Promotions

Sobhita Dhulipala :  తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ తెలుగులో గూడాచారి(Goodachari), మేజర్(Major) సినిమాలే తీసినా హిందీలో మాత్రం వరుస సినిమాలు, సిరీస్ లతో బిజీగా ఉంది. ఇటీవల పొన్నియిన్ సెల్వన్(Ponniyin Selvan) సినిమాతో మెప్పించింది శోభిత. బాలీవుడ్(Bollywood) లో కొన్ని రోజుల క్రితం ది నైట్ మేనేజర్(The Night Manager) అనే సిరీస్ చేసింది శోభిత. ఇప్పుడు ఆ సిరీస్ కి సీజన్ 2 రానుంది. ది నైట్ మేనేజర్ సీజన్ 2 జూన్ 30న హాట్‌స్టార్ ఓటీటీలో విడుదల కానుంది. దీంతో ఆ సిరీస్ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది శోభిత.

ది నైట్ మేనేజర్ సీజన్ 2 సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలలో మరోసారి తనపై వచ్చిన రూమర్స్ గురించి స్పందించింది. అలాగే తనకి కాబోయే వరుడు ఎలా ఉండాలో చెప్పింది శోభిత. కొన్ని రోజుల క్రితం నాగచైతన్యతో శోభిత డేటింగ్ లో ఉన్నాయనే వార్తలు వచ్చాయి. గతంలోనే వీటిపై స్పందిస్తూ అలాంటిదేమి లేదు అని చెప్పింది శోభిత. తాజాగా మరోసారి దీనిపై మాట్లాడుతూ.. అలాంటి వార్తలు నన్ను ఇబ్బంది పెట్టావు. ఎవరైనా నా వర్క్ గురించి మాట్లాడితే సంతోషిస్తా. ఇలాంటివి మాట్లాడితే అసలు పట్టించుకోను. ఎన్నో కష్టాలు, ఎన్నో ఆడిషన్స్ తర్వాత నేను ఇప్పుడే వరుసగా ప్రాజెక్టులు చేస్తున్నాను. నా పని కోసం నేను ఇప్పుడు కష్టపడుతున్నాను. అలాంటి వాటిని పట్టించుకునే తీరిక కూడా లేదు అని చెప్పింది.

Dipika Chikhlia : ఆదిపురుష్ గురించి మాట్లాడను.. రామాయణంపై సినిమాలు ఇక తీయకండి.. రామాయణం సీరియల్ సీత వ్యాఖ్యలు..

ఇక తనకి కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్తూ..నేను పెళ్లి చేసుకునే వ్యక్తి జీవితంలో ఎంత ఎత్తుకి ఎదిగినా అణిగిమణిగి ఉండాలి. సింపుల్ గా, మంచి మనసు, ఇతరుల పట్ల దయతో ఉండాలి. ప్రకృతిని ప్రేమించాలి. ఈ జీవితం చాలా చిన్నదని గ్రహించాలి. జీవితంలో ఉన్న ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలి. నాతో ఉండే క్షణాలు ఇంకా బాగుండాలి అని తెలిపింది.