Sobhita- Naga Chaitanya : పెళ్ళికి ముందే నాగచైతన్య – శోభిత ఎక్కడికెక్కడికి ట్రిప్స్ వేసారో తెలుసా?

ఈ ఇంటర్వ్యూలో వీరిద్దరూ పెళ్ళికి ముందు వెళ్లిన ట్రిప్స్ గురించి కూడా చెప్పారు.

Sobhita Naga Chaitanya Revealed about their Trips before Marriages

Sobhita- Naga Chaitanya : తాజాగా నాగచైతన్య – శోభిత న్యూయార్క్ టైమ్స్ కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వీరి ప్రేమ, పెళ్లి గురించి అనేక విషయాలు తెలిపారు. ఆల్మోస్ట్ రెండేళ్ల నుంచి ప్రేమించుకొని ఇటీవల కేవలం కుటుంబ సభ్యులు, కొంతమంది సన్నిహితుల మధ్యే వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

ఈ ఇంటర్వ్యూలో వీరిద్దరూ పెళ్ళికి ముందు వెళ్లిన ట్రిప్స్ గురించి కూడా చెప్పారు. మొదట వీరిద్దరూ ముంబైలోని ఓ కాఫీ షాప్ లో కలిశారు. వీరిద్దరి ప్రేమ మొదలయ్యాక కర్ణాటకలోని బందీపూర్ నేషనల్ పార్క్ కి వెళ్లారట. అక్కడ చాలా సమయం గడిపి ఒకరి గురించి ఒకరు మరింత తెలుసుకున్నారట. అలాగే గత సంవత్సరం నాగచైతన్య పుట్టిన రోజుని సెలబ్రేట్ చేసుకోడానికి లండన్ వెళ్లారట. ఈ సంవత్సరం మార్చ్ లో కూడా మరోసారి లండన్ వెళ్లారు ఈ జంట. అలాగే ఇటీవల ఆగస్టులో గోవాకు వెళ్లారట. అక్కడే చైతు పెళ్లి ప్రపోజల్ చేయడంతో గోవా నుంచి రాగానే వెంటనే నిశ్చితార్థం చేసుకున్నారు ఈ జంట అని తెలిపారు.

Also Read : Dacoit : అవును ప్రేమించావు.. కానీ మోసం చేసావు.. అడివి శేష్ ‘డెకాయిట్’ ప్రేమ కథ..

గతంలో పెళ్ళికి ముందు ఈ జంట లండన్ వెళ్ళినప్పుడు ఒక ఫోటో లీక్ అయిన సంగతి తెలిసిందే. ఈ కొన్ని ట్రిప్స్ గురించే చైతు – శోభిత తెలిపారు. మరి ఇంకెన్ని ట్రిప్స్ వేసారో తెలియాలి. ఇప్పుడు పెళ్లి అయ్యాక హనీమూన్ కి ఎక్కడికి ట్రిప్ వెళ్తారో చూడాలి.