Dacoit : అవును ప్రేమించావు.. కానీ మోసం చేసావు.. అడివి శేష్ ‘డెకాయిట్’ ప్రేమ కథ..

తాజాగా నేడు అడివి శేష్ పుట్టిన రోజు సందర్భంగా డెకాయిట్ సినిమా నుంచి కొత్త పోస్టర్స్ రిలీజ్ చేసి..

Dacoit : అవును ప్రేమించావు.. కానీ మోసం చేసావు.. అడివి శేష్ ‘డెకాయిట్’ ప్రేమ కథ..

Adivi Sesh Dacoit Movie Sruthi Haasan Replaced by Mrunal Thakur Shares New Posters

Updated On : December 17, 2024 / 11:40 AM IST

Dacoit : తక్కువ బడ్జెట్ లో మంచి మంచి సస్పెన్స్ థ్రిల్లింగ్ సినిమాలు అందచేసి హిట్స్ కొడతాడు అడివిశేష్. శేష్ చివరగా 2022లో హిట్ 2 సినిమాతో వచ్చి విజయం సాధించాడు. ఆ సినిమా వచ్చి రెండేళ్లు దాటుతున్నా ఇంకా అడివి శేష్ దగ్గర్నుంచి ఎలాంటి సినిమా రాలేదు. కానీ ప్రస్తుతం కొన్ని సినిమాలు చేస్తున్నాడు. ఇటీవల అడివిశేష్, శృతి హాసన్ జంటగా డెకాయిట్ అనే సినిమాని ప్రకటించారు. ఈ టైటిల్ కు ఒక ప్రేమ కథ అనే ట్యాగ్ లైన్ కూడా ఇచ్చారు.

ప్రస్తుతం డెకాయిట్ సినిమా షూటింగ్ కూడా జరుగుతుంది. ఇప్పటికే డెకాయిట్ సినిమా నుంచి గ్లింప్స్ కూడా రిలీజ్ చేసారు. అయితే కొన్ని కారణాలతో శృతి హాసన్ ఆ సినిమా నుంచి తప్పుకుందని వార్తలు వచ్చాయి. నిన్న అడివి శేష్ తో పాటు ఇంకో హీరోయిన్ ఫేస్ కనపడకుండా ఉన్న డెకాయిట్ సినిమా కొత్త పోస్టర్ రిలీజ్ చేసారు. దీంతో ఆ పోస్టర్ లో ఉన్నది మృణాల్ ఠాకూర్ అని, శృతి హాసన్ సినిమా నుంచి తప్పుకుందని క్లారిటీ వచ్చేసింది అందరికి.

Also Read : Tollywood Marriages : 2024లో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలెబ్రిటీలు వీళ్ళే..

తాజాగా నేడు అడివి శేష్ పుట్టిన రోజు సందర్భంగా డెకాయిట్ సినిమా నుంచి కొత్త పోస్టర్స్ రిలీజ్ చేసి అధికారికంగా ఇందులో మృణాల్ ఠాకూర్ నటిస్తుందని ప్రకటించారు. మృణాల్ ఒక పోస్టర్ షేర్ చేస్తూ.. అవును వదిలేసాను.. కానీ మనస్పూర్తిగా ప్రేమించాను అని రాసుకొచ్చింది. దీనికి రిప్లైగా శేష్ మరో పోస్టర్ షేర్ చేసి.. అవును ప్రేమించావు.. కానీ మోసం చేసావు.. ఇడిచిపెట్టను…తేల్చాల్సిందే అని రాసుకొచ్చాడు.

దీంతో డెకాయిట్ సినిమా ఇద్దరి ప్రేమికుల మధ్య జరిగే ఆసక్తికర కథ అని తెలుస్తుంది. ఇక ఈ సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై సుప్రియ యార్లగడ్డ నిర్మాణంలో యువ కెమరామెన్ షానిల్ డియో దర్శకుడిగా మారి తెరకెక్కిస్తున్నాడు. మరి శృతి హాసన్ ఎందుకు ఈ సినిమా నుంచి తప్పుకుందో, ఆల్రెడీ షూట్ చేయడం వల్ల ఎంత నష్టం వచ్చిందో అని చర్చిస్తున్నారు. ఇక ఈ సినిమా 2025లో రిలీజ్ అవుతుందని తెలుస్తుంది.